సికింద్రాబాద్లోని HDFC బ్యాంక్లో ఉద్యోగం.. పెళ్లి కావట్లేదని ప్రాణం తీసుకుంది !

సికింద్రాబాద్లోని HDFC బ్యాంక్లో ఉద్యోగం.. పెళ్లి కావట్లేదని ప్రాణం తీసుకుంది !

జీడిమెట్ల, వెలుగు: అనారోగ్య సమస్యలకు తోడు పెళ్లి కావడం లేదన్న దిగులుతో ఓ యువతి సూసైడ్​ చేసుకుంది. సిద్ధిపేట జిల్లా మద్దూర్​ మండలం రేబర్తి గ్రామానికి చెందిన కుంటి నిరోష(32) సికింద్రాబాద్లోని HDFC బ్యాంక్లో ఉద్యోగం చేస్తోంది. చింతల్​ పద్మానగర్​లో తన సోదరుడు నరేశ్​తో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. 

ఆమెకు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీనికి తోడు వివాహం జరగడం లేదు. దీంతో మనస్తాపానికి గురైన నిరోష గురువారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్​కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.