ఘట్కేసర్, వెలుగు: గ్యాస్ ట్యాంకర్ ఢీ కొని టెకీ మృతి చెందాడు. సీఐ రాజువర్మ తెలిపిన ప్రకారం. మల్కాజిగిరికి చెందిన బోసుకొండ వరప్రసాద్(29) పోచారంలోని ఇన్ఫోసిస్లో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. డ్యూటీ ముగించుకొని శుక్రవారం మధ్యాహ్నం ఉప్పల్ వైపు బైక్పై వెళ్తున్నాడు. జోడిమెట్ల చౌరస్తా సమీపంలో వెనుకాల నుంచి గ్యాస్ ట్యాంకర్ ఢీకొట్టింది. వరప్రసాద్‌కు తీవ్రగాయాలు కాగా స్థానికులు గాంధీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ట్యాంకర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
