బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌లో భూకంపం.. ఆరుగురు మృతి.. ..30 సెకండ్లు ఊగిపోయిన బిల్డింగులు

బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌లో భూకంపం.. ఆరుగురు మృతి.. ..30 సెకండ్లు ఊగిపోయిన బిల్డింగులు
  • మరో 65 మందికి తీవ్ర గాయాలు

 ఢాకా: బంగ్లాదేశ్​ను పెను భూకంపం కుదిపేసింది. రాజధాని ఢాకా సమీపంలో శుక్రవారం ఉదయం 10.08 గంటలకు సంభవించిన ప్రకంపనల ధాటికి పలు బిల్డింగులు నేలకూలాయి. దీని తీవ్రత రిక్టర్‌‌‌‌‌‌‌‌ స్కేల్‌‌‌‌‌‌‌‌పై 5.5గా నమోదు కాగా.. ఆరుగురు మృతిచెందినట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. భవనం పైకప్పు, గోడ కూలి ముగ్గురు, బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ల రెయిలింగ్‌‌‌‌‌‌‌‌లపై పడి మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో 65 మందికి తీవ్రగాయాలయ్యాయి. 

భూకంప కేంద్రం ఢాకాకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్సింగ్‌‌‌‌‌‌‌‌ ది జిల్లాలోని ఘోరాషాల్ ప్రాంతంలో కేవలం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నదని నేషనల్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫర్ సిస్మోలజీ(ఎన్‌‌‌‌‌‌‌‌సీఎస్‌‌‌‌‌‌‌‌) వెల్లడించింది.   దీంతో ప్రజలు ఇండ్లనుంచి బయటకు పరుగులు తీశారు. బంగ్లాదేశ్ తాత్కాలిక సర్కారు వెంటనే సహాయక చర్యలు చేపట్టింది.

కోల్​కతాలోనూ..

బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌లో సంభవించిన భూకంపం నేపథ్యంలో కోల్‌‌‌‌‌‌‌‌కతాతోపాటు తూర్పు భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు సంభవించాయి. కోల్‌‌‌‌‌‌‌‌కతాలో 30 సెకండ్లు బిల్డింగులు ఊగిపోయాయి. ప్రజలు ఇండ్లనుంచి బయటకు పరుగులు తీశారు.