యాషెస్ తొలి టెస్ట్: ఒక్క రోజే 19 వికెట్లు.. ఇంగ్లండ్172 ఆలౌట్.. ఆసీస్ 123/9

యాషెస్ తొలి టెస్ట్: ఒక్క రోజే 19 వికెట్లు.. ఇంగ్లండ్172 ఆలౌట్.. ఆసీస్ 123/9

పెర్త్‌‌: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌‌ మధ్య శుక్రవారం మొదలైన యాషెస్‌‌ తొలి టెస్ట్‌‌కు తొలి రోజే అదిరిపోయే ఆరంభం లభించింది. ఆసీస్‌‌ స్టార్‌‌ పేసర్‌‌ మిచెల్‌‌ స్టార్క్‌‌ (7/58) కెరీర్‌‌ బెస్ట్‌‌  బౌలింగ్ చేస్తే, ఇంగ్లిష్‌‌ కెప్టెన్‌‌ బెన్‌‌ స్టోక్స్‌‌ (5/23) ఐదు వికెట్లతో రెచ్చిపోయాడు. దాంతో యాషెస్‌‌ చరిత్రలో గత వందేండ్లలో తొలిసారిగా ఒక్క రోజే 19 వికెట్లు నేలకూలాయి. 

ఇదివరకు 1909లో ఓల్ట్‌‌ ట్రాఫోర్డ్‌‌లో జరిగిన మ్యాచ్‌‌లో తొలి రోజే 20 వికెట్లు పడ్డాయి. ఇక టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌కు దిగిన ఇంగ్లండ్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌లో 32.5 ఓవర్లలో 172 రన్స్‌‌కే ఆలౌటైంది. హ్యారీ బ్రూక్‌‌ (52), ఒలీ పోప్‌‌ (46), జెమీ స్మిత్‌‌ (33), బెన్‌‌ డకెట్‌‌ (21) మాత్రమే రాణించారు. జాక్‌‌ క్రాలీ (0), జో రూట్‌‌ (0), స్టోక్స్‌‌ (6), అట్కిన్సన్‌‌ (1), బ్రైడన్‌‌ కార్స్ (6), ఆర్చర్‌‌ (0 నాటౌట్‌‌), మార్క్‌‌ వుడ్‌‌ (0) సింగిల్‌‌ డిజిట్‌‌కే పరిమితమయ్యారు. 

డాగెట్‌‌ 2, గ్రీన్‌‌ ఒక వికెట్‌‌ తీశాడు. తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన ఆస్ట్రేలియా ఆట ముగిసే టైమ్‌‌కు తొలి ఇన్నింగ్స్‌‌లో 39 ఓవర్లలో 123/9 స్కోరు చేసింది. లైయన్‌‌ (3 బ్యాటింగ్‌‌), డాగెట్‌‌ (0 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు. అలెక్స్‌‌ క్యారీ (26) టాప్‌‌ స్కోరర్‌‌. కామెరూన్‌‌ గ్రీన్‌‌ (24), ట్రావిస్‌‌ హెడ్‌‌ (21), స్మిత్‌‌ (17)సహా మిగతా అందరూ ఫెయిలయ్యారు. ఆర్చర్‌‌, కార్స్‌ చెరో రెండు వికెట్లు తీశారు. ప్రస్తుతం ఆసీస్‌‌ ఇంకా 49 రన్స్‌‌ వెనకబడి ఉంది.