సహజీవనం చేసి బిడ్డ పుట్టాక మొహం చాటేశాడు.. పాపం ఈ ఫిల్మ్ నగర్ యువతి !

సహజీవనం చేసి బిడ్డ పుట్టాక మొహం చాటేశాడు.. పాపం ఈ ఫిల్మ్ నగర్ యువతి !

జూబ్లీహిల్స్, వెలుగు: యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ యువకుడు ఆమెతో బిడ్డను కన్నాక మొహం చాటేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన  బానోతు సురేందర్(29)  ప్రైవేటు ఉద్యోగం చేస్తూ షేక్ పేటలోని మారుతి నగర్ లో నివసిస్తున్నాడు. ఫిలింనగర్లో నివసించే ఓ యువతితో పరిచయం కాగా ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఎలాగైనా పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కొన్ని రోజులు ఆమెతో సహజీవనం చేసి ఓ బిడ్డకు జన్మనిచ్చాడు.

యువతి పెళ్లి చేసుకుందామని సురేందర్ ను కోరగా కొంతకాలంగా సాకులు చెబుతూ తప్పించుకుంటున్నాడు. గట్టిగా నిలదీయడంతో మొహం చాటేశాడు. దీంతో బాధిత యువతి ఫిలింనగర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి సురేందర్ ను రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.