మలేషియాలో డిసెంబర్ 27న ‘జన నాయగన్’ పాటల వేడుక

మలేషియాలో డిసెంబర్ 27న ‘జన నాయగన్’ పాటల వేడుక

కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్’. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై యగదీష్ పళనిస్వామి, లోహిత్ కలిసి  నిర్మిస్తున్నారు. విజయ్ హీరోగా నటిస్తున్న చివరి మూవీ కావడంతో దీనిపై ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డాయి.  ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‌‌‌‌  మలేషియాలో జరగనుందని  గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతుండగా, దాన్ని నిజం చేస్తూ  శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన  క్రేజీ అప్‌‌‌‌డేట్ ప్రకటించారు మేకర్స్.

డిసెంబర్ 27న మలేషియాలోని కౌలాలంపూర్ స్టేడియంలో ఈ మూవీ ఆడియో  లాంచ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించనున్నట్టు ఓ స్పెషల్ వీడియోతో అనౌన్స్ చేశారు. విజయ్ గత సినిమాల్లోని స్టిల్స్‌‌‌‌ను చూపిస్తూ ఆయనకున్న ఇమేజ్‌‌‌‌ను ప్రజెంట్ చేసేలా సాగిన వీడియో ఆకట్టుకుంది. పూజా హెగ్డే హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో  బాబీ డియోల్, మమితా బైజు, ప్రియమణి, గౌతమ్ మీనన్, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.  సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ  చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.