- ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో దారుణం
వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : మతిస్థిమితం లేని ఓ పదమూడేండ్ల బాలికపై 70 ఏండ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్సై చల్ల రాజు తెలిపిన వివరాల ప్రకారం... వెంకటాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏండ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన, బాలిక కుటుంబ సభ్యులకు బంధువైన 70 ఏండ్ల వృద్ధుడు 15 రోజుల కింద అత్యాచారం చేశాడు.
బాలిక ప్రవర్తనలో మార్పు రావడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆరా తీయడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, వివరాలు సేకరిస్తున్నామని డీఎస్పీ రవీందర్, ఎస్సై చల్ల రాజు తెలిపారు.
