ఆధ్యాత్మికం: నమ్మకం అంటే ఏమిటి.. అది ఎలా ఏర్పడుతుంది..

ఆధ్యాత్మికం:  నమ్మకం అంటే ఏమిటి.. అది  ఎలా ఏర్పడుతుంది..

జీవితంలో అన్నింటికంటే విలువైనది నమ్మకం! ఇతరులతో మాట్లాడేటప్పుడు నమ్మకంగా మాట్లాడగలగాలి. ఏదైనా సాధించాలనుకున్నపుడు మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఇక, అనుబంధం సంతోషంగా సాగాలంటే.. ఇద్దరి మధ్య ఉండాల్సింది కూడా నమ్మకం! 

నమ్మకం చుట్టూనే జీవితం తిరుగుతుంటుంది. ఫ్యామిలీ మీద నమ్మకం ఉండాలి. డాక్టర్ మీద నమ్మకం ఉండాలి. కొలీగ్స్ మీద, ఫ్రెండ్స్ మీద.. చివరికి పరమాత్మ మీద కూడా నమ్మకమే ఉండాలి. కానీ, అసలు నమ్మకం అంటే ఏంటి? గుడ్డి నమ్మకం ఎలా ఉంటుంది? అసలు నమ్మకాలు ఎలా ఉంటాయి?

ఏ రీజన్ లేకుండా, ఏ ఆధారం లేకుండా దేన్నైనా సమ్మితే అది  గుడ్డి నమ్మకం. ఇలాంటి గుడ్డి నమ్మకాల్ని ప్రశ్నించకపోవడం చాలా ప్రమాదకరం. అయితే, నమ్మకం మాత్రం రేషనల్ థింకింగ్, లాజిక్ మీద ఆధారపడి ఉంటుంది. పక్కింటి వ్యక్తి ఆ డాక్టర్ మంచోడు. బాగా చూస్తాడు' అని చెప్తే జబ్బు చేసినప్పుడు అతని దగ్గరికే వెళ్తుంటారు. కానీ, వెళ్లేముందు అతని బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయాలి. ఒకవేళ ఆ డాక్టర్ని నమ్మితే. అతని గురించి అన్నీ మంచి విషయాలే మాట్లాడుకుంటారు. అదే ఒకవేళ ఆ డాక్టర్ని నమ్మకపోయినా.. అర్థం చేసుకోకపోయినా ప్రతిసారీ ప్రశ్నిస్తూనే ఉంటారు.

గుడ్డిగా పాటించలేదు

ఎవ్వరి సలహానూ గుడ్డిగా పాటించలేరు. ఇదే లాయరికి, చార్టర్డ్ అకౌంటెంట్​తో  పాటు ఆధ్యాత్మిక గురువుకూ వర్తిస్తుంది. ఈ అన్ని సందర్భాల్లోనూ ఎలాంటి జ్ఞానం లేకుండా వాళ్ల దగ్గరికి వెళ్తే.. కచ్చితంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటారు. వాళ్లకు తెలిసింది మనకు తెలియదు కాబట్టి, వాళ్ల మీద నమ్మకం కలిగి ఉండాలి. అయితే. అది గుడ్డి నమ్మకం కాకూడదు. ఆ వ్యక్తి మనకు సాయం చేయగలడు అన్నప్పుడు పూర్తి నమ్మకంతో ఉండాలి. వాళ్ళను ఏదైనా అడగడానికి, తెలియంది తెలుసుకోవడానికి అవసరమయ్యే స్వేచ్ఛ కచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఆ వ్యక్తి మీద నమ్మకం కలగకపోతే.. మనకు సాయం చేస్తారా? లేదా? అనే సందేహం కలుగుతుంటేఅ సంబంధానికి అర్థం లేదు. ఏదేమైనప్పటికీ, మన సొంత తెలివిని ఉపయోగించకుండా.. ఎలాంటి ప్రశ్నలు, సందేహాలు లేకుండా ఒక వ్యక్తిని నమ్మితే.. కచ్చితంగా అది గుడ్డి నమ్మకమే! ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్లేటప్పుడు కూడా అది గుడ్డి నమ్మకం కాకుండా చూసుకోవాలి.

"దేవుడు ఉన్నాడా?" అంటే దీన్ని చెక్ చేసుకునే అవకాశమే లేదు, కాబట్టి, పరమాత్మ మీద విశ్వాసం ఉంచడమే చేయగలిగింది. అయితే, గురువునూ, గురువు చెప్పే మార్గాలను విశ్లేషించడానికి మాత్రం సొంత తెలివి ఉపయోగించడం చాలా ముఖ్యం.

ఇలా తెలుసుకొని...

మన దగ్గర ఇప్పుడు చాలామంది ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. వాళ్లలో ఎంతోమంది గొప్పవాళ్లుగా చెలామణి అవుతున్నారు. టీవీల్లో, సోషల్ మీడియాలో వాళ్లకు ఉన్న ఫాలోయింగ్​ను బట్టి నమ్మకాన్ని ఏర్పరుచుకోకూడదు. ఆ గురువు పర్సనాలిటీ ఏంటి? వాళ్లు ఎలాంటి ఆధ్యాత్మిక విధానాలు అనుసరిస్తున్నారు? వాళ్ల భక్తి మార్గం ఏంటి? వాళ్ల జ్ఞానం ఎలాంటి సందేశాన్ని ఇస్తోంది? అని విశ్లేషించుకున్న తర్వాతే వాళ్ల దగ్గరికి వెళ్లాలి లేదంటే, కాలు విరిగితే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్లినట్టే అవుతుంది! కాబట్టి, మన పర్సనాలిటీకి తగ్గ గురువును ఎంచుకోవడం చాలా ముఖ్యం.

శిష్యుడి లక్షణాలివి...

శిష్యుడికి ఉండాల్సిన లక్షణాల గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు వివరించాడు. లొంగిపోవడం, ప్రశ్నించడం, సేవ. ఈ మూడు లక్షణాలు ఉన్నవాడే అసలైన శిష్యుడు అని చెప్పాడు. ఈ లక్షణాలు ఉన్న శిష్యుడికే జ్ఞానోదయం కలుగుతుంది. గురువుకు లొంగిపోవడం అనేది నమ్మకానికి సంబంధించింది. గురువు బోధనల్ని వినాలంటే ముందుగా లొంగిపోవాలి. ఆ తర్వాత ఆయన చెప్పేవాటిని ప్రశ్నించాలి. వాటికి సరైన సమాధానం చెప్పినప్పుడు, ప్రశ్నలు అడిగే స్వేచ్చని ఇచ్చినప్పుడు అతడు అసలైన గురువుగా గుర్తింపు పొందుతాడు. 

తెలివి ఇంపార్టెన్స్ గురించి, జీవితంలో ముందడగు వేయడానికి సంతోషంగా ఉండటానికి తెలివి ముఖ్యమని భగవద్గీత వివరించింది. అందుకే, తెలివితేటలను డెవలప్​ చేయడానికి సాయపడని ఏ కోర్చుతోనూ లాభం లేదు.లొంగిపోవడం, ప్రశ్నించడం, సేవ.. ఈ మూడు లక్షణాలు ఉన్నవాడే అసలైన శిష్యుడు అని చెప్పాడు. ఈ లక్షణాలు ఉన్న శిష్యుడికే జ్ఞానోదయం కలుగుతుంది.

దారి చూపిస్తుంది

గొప్ప గురువు కేవలం ప్రశ్నలు అడగడానికి మాత్రమే స్వేచ్ఛని ఇవ్వడు. శిష్యుడు విసిరే సవాళ్లను స్వీకరించి వాటిని కూడా పరిష్కరిస్తాడు. అయితే ఇదంతా జరగడానికి ముందు గురుశిష్యుల మధ్య నమ్మకం అనే బలమైన వంతెన ఏర్పడాలి... 

నిజమైన గురువు జీవితం పట్ల లోతైన అవగాహన కలిగి ఉంటాడు. వాళ్ల బోధనలు మన జీవితానికి అన్వయించుకునే విధంగా చాలా దగ్గరగా ఉంటాయి. ఇదే నమ్మకానికి దారులు వేస్తుంది. నమ్మకం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. నమ్మకం ఉన్న వాతావరణంలో ఇద్దరి మధ్యా జ్ఞాన ప్రవాహం అధికంగా ఉంటుంది. ఫైనల్​గా ఇది జ్ఞానోదయానికి దారి చూపిస్తుంది!

వెలుగు,లైఫ్​