ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేస్తున్న రాజు వెడ్స్‌‌ రాంబాయి కథ

ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేస్తున్న రాజు వెడ్స్‌‌ రాంబాయి కథ

‘రాజు వెడ్స్ రాంబాయి’  సినిమాకు  ప్రేక్షకులంతా ఎమోషనల్‌‌గా కనెక్ట్ అవుతున్నారని మూవీ టీమ్ చెప్పింది.  అఖిల్ రాజ్, తేజస్విని జంటగా సాయిలు కంపాటి దర్శకత్వంలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించగా,  వంశీ నందిపాటి, బన్నీ వాస్ శుక్రవారం థియేట్రికల్ రిలీజ్ చేశారు. 

విడుదలైన ప్రతి సెంటర్‌‌‌‌లో ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని మేకర్స్ చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో బన్నీ వాస్ మాట్లాడుతూ ‘ఈ  సినిమాను ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకుంటున్నారు.  ప్రేమలో ఉన్న అమ్మాయి, అబ్బాయి, ఆ ప్రేమను వద్దనే తండ్రి ప్రతి ఒక్కరూ ఈ కథకు కనెక్ట్ అవుతున్నారు.   సినిమా కంటెంట్‌‌ను జడ్జ్ చేయడంలో మేమంతా సక్సెస్ అయ్యాం’ అని అన్నారు. ఈ చిత్రానికొస్తున్న రెస్పాన్స్ పట్ల సంతోషంగా ఉన్నామని హీరో హీరోయిన్ చెప్పారు. సినిమాను ఆదరిస్తున్న  ప్రేక్షకులకు దర్శక నిర్మాతలు థ్యాంక్స్ చెప్పారు. టీమ్ అంతా పాల్గొన్నారు.