మొదటి పాటకు ముహూర్తం.. 23న ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్

మొదటి పాటకు ముహూర్తం.. 23న ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్

ప్రభాస్‌‌‌‌ హీరోగా మారుతి రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ది రాజా సాబ్’. తాజాగా ఫస్ట్ సాంగ్ అప్‌‌‌‌డేట్ అందించారు మేకర్స్. ఈనెల 23న మొదటి పాటకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రభాస్ కొత్త పోస్టర్ ఆకట్టుకుంది. ఇందులో స్టైలిష్‌‌‌‌ లుక్‌‌‌‌లో మెస్మరైజ్ చేస్తున్నాడు ప్రభాస్. 

కలర్‌‌‌‌‌‌‌‌ఫుల్ బ్యాక్‌‌‌‌గ్రౌండ్ మధ్యన స్టైలిష్ డ్యాన్స్‌‌‌‌ మూమెంట్‌‌‌తో ఇంప్రెస్ చేస్తున్నాడు. తమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ క్రేజీగా ఉండనుందని మేకర్స్ చెప్పారు. హారర్ కామెడీ జానర్‌లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం అని అన్నారు.

మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌‌‌‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా సినిమా విడుదల కానుంది.