ఫేషియల్ రికగ్నిషన్తో హాజరు శాతం పెరుగుదల..సీఎంఓ సెక్రటరీ అజిత్ రెడ్డి

ఫేషియల్ రికగ్నిషన్తో  హాజరు శాతం పెరుగుదల..సీఎంఓ సెక్రటరీ అజిత్ రెడ్డి
  • సీఎంఓ సెక్రటరీ అజిత్ రెడ్డి సమీక్ష 
     

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్​లో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్)తో విద్యార్థులు, సిబ్బంది అటెండెన్స్ పెరిగిందని, కాలేజీల నిర్వహణలో పారదర్శకత మెరుగుపడిందని సీఎంఓ సెక్రటరీ అజిత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఇంటర్​ బోర్డు కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. 

ఈ సందర్భంగా జూనియర్ కాలేజీల్లో అమలు అవుతున్న పలు కార్యక్రమాలను సమీక్షించారు. కమాండ్ కంట్రోల్ రూమ్​ను పరిశీలించి, రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ నిఘా వ్యవస్థ పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య.. ఇంటర్ విద్యాశాఖ, బోర్డు చేపట్టిన పలు చర్యలను ఆయనకు వివరించారు.