సమస్యలపై మాట్లాడితే అరెస్టులా ?: బీజేపీ కార్పొరేటర్లు

సమస్యలపై మాట్లాడితే అరెస్టులా ?: బీజేపీ కార్పొరేటర్లు

బషీర్​బాగ్​, వెలుగు: ప్రజా సమస్యలపై మాట్లాడితే తమపై దాడులు చేసి, అరెస్టులు చేయిస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో తమను అక్రమంగా అరెస్ట్​ చేశారని కార్పొరేటర్లు ఆకుల శ్రావణి, మహేందర్, శ్రవణ్  అన్నారు. కాచిగూడలోని బీజేపీ సిటీ ఆఫీసులో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. 

కేంద్రం నుంచి నిధులు వస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం వాటిని అభివృద్ధికి ఉపయోగించడం లేదన్నారు. బీజేపీ కార్పొరేటర్ల డివిజన్లలో అభివృద్ధి పనుల కోసం నిధులు అడిగితే ఇవ్వడం లేదన్నారు. మేయర్ తమపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు.