పాక్ లో బాయిలర్ పేలి 15 మంది మృతి.. పంజాబ్ ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌లోని ఫైసలాబాద్లో ఘటన

పాక్ లో  బాయిలర్ పేలి 15 మంది మృతి.. పంజాబ్ ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌లోని ఫైసలాబాద్లో ఘటన

ఫైసలాబాద్: పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌లోని ఫైసలాబాద్​లో శుక్రవారం ఉదయం పత్తి ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి 15 మంది కార్మికులు మృతిచెందారు.  ఈ ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ చుట్టుపక్కల భవనాలు దెబ్బతిన్నాయి. రెస్క్యూ టీమ్స్, ఫైర్ సిబ్బంది, స్థానిక పోలీసులు కలిసి కార్మికులను రక్షించే చర్యలు చేపట్టారు. పేలుడు తర్వాత ఫ్యాక్టరీ యజమాని పరారయ్యాడు. అయితే పోలీసులు మేనేజర్‌‌‌‌‌‌‌‌ను అదుపులోకి తీసుకున్నారు. బాయిలర్ నిర్వహణలో లోపాలవల్లే పేలుడు సంభవించినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై పంజాబ్ సీఎం మరియం నవాజ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.