30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ.. పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్

30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ.. పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్

హైదరాబాద్: పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సుమారు 30 వేల ఎకరాలల్లో ఫ్యూచర్ సిటీని ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని, స్కిల్ యూనివర్సిటీ, అంతర్జాతీయ క్రీడా మైదానాలు, ఐటీ, ఏఐ కేంద్రాలు వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవేకు అన్ని అను మతలు లభించాయని చెప్పారు. పారిశ్రామిక ఎగుమతుల్లో విప్లవాత్మక మార్పులకు ఈ హైవే శ్రీకారం చుట్టనుందనీ చెప్పారు. 

ఇవాళ ప్రజా భవన్ లో కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో డెల్లాయిట్, ఈవై, కేపీఎంజీ, బీసీజీ, పీడబ్ల్యూ సీ, జెఎల్ఎల్ సహా పలు సంస్థల ప్రతినిధులుపాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడు తూ 'ప్రజాప్రభుత్వం 2047 నాటికి రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ స్థాయికి తీసు కెళ్లాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. రాష్ట్ర అర్థికాభివృద్ధికి, పెట్టుబడులకు వాతావరణ పరిస్థితులు, భౌగోళిక అంశాలతో పాటుగా నైపుణ్యంతో కూడిన తక్కువ ధరలకే మానవ వనరులు అందుబాటులో ఉండడం కలిసివచ్చే అంశాలు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు 39 రేడియల్ రోడ్ల ప్రణాళిక రూపొందించాం. వీటి మధ్యలో ఫార్మా, ఐటీ, హ్యాండ్లూమ్, ఆగ్రో వంటి పారిశ్రామిక పార్కులు రాబోతున్నాయి' అని అన్నారు.