వంట గ్యాస్ కొరత లేదు : కలెక్టర్లు అనురాగ్ జయంతి

వంట గ్యాస్ కొరత లేదు : కలెక్టర్లు అనురాగ్ జయంతి

యాదాద్రి/ మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: యాదాద్రి, మహబూబ్​నగర్​ జిల్లాలో వంట గ్యాస్​ కొరత లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మి వినియోగదారులు ఆందోళన చెందవద్దని ఆయా జిల్లా కలెక్టర్లు అనురాగ్​ జయంతి, కుష్బూ గుప్తా తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ బుకింగ్​ చేసినా గ్యాస్​ రాకుంటే వెంటనే సంబంధిత ఆఫీసర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అనవసరంగా గ్యాస్​ బుకింగ్​చేయవద్దన్నారు.