ఆఫర్ సేల్ లో తోపులాట పలువురు మహిళలకు గాయాలు

ఆఫర్ సేల్ లో తోపులాట పలువురు మహిళలకు గాయాలు

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లిలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్లో శనివారం ఆర్కే కలెక్షన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్లియరెన్స్ సేల్​లో ఉద్రిక్తత నెలకొంది. తక్కువ ధరకే వస్త్రాలు లభిస్తాయని మహిళలు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది.

నిర్వాహకులు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం, భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారి తొక్కిసలాట సంభవించింది. ఈ ఘటనలో పలువురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధ్యులైన నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు