కూకట్పల్లి, వెలుగు: కూకట్‌పల్లిలోని న్యూ ఎరా స్కూల్ విద్యార్థులకు అదే పాఠశాలలో పదో తరగతి పరీక్షా కేంద్రం కేటాయించడంపై బాధిత తల్లిదండ్రులు శనివారం ఆందోళనకు దిగారు. సాంకేతిక కారణాల వల్ల ఈ పొరపాటును జరిగిందని విద్యాశాఖ అధికారులు గుర్తించారు. వెంటనే స్కూల్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని, 20 మంది ప్రత్యేక సిబ్బందితో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్, బయటి ఇన్విజిలేటర్లను నియమించి పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అధికారుల సత్వర చర్యలతో వివాదం సర్దుమణిగింది.
హైదరాబాద్ సిటీ: జూబ్లీహిల్స్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ హరిచందన దాసరి తనిఖీ చేశారు. రెగ్యులర్ విద్యార్ధులు 74,383 మందికి గాను తొలిరోజు 73,610 మంది హాజరయ్యారని, 773 మంది గైర్హాజరయ్యారన్నారు.
