భారత్‌లో నిలిపేసిన ఫోర్డ్‌ మోటార్‌ ఉత్పత్తి

భారత్‌లో నిలిపేసిన ఫోర్డ్‌ మోటార్‌ ఉత్పత్తి

అమెరికాకు చెందిన ఆటోమొబైల్‌ సంస్థ ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ భారత్‌లో ఉన్న రెండు యూనిట్లలో కార్ల తయారీనీ నిలిపేస్తున్నట్లు ఇవాళ(గురువారం) ప్రకటించింది. దీంతో సుమారు 4 వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. చెన్నై (తమిళనాడు), సనంద్‌ (గుజరాత్‌) ప్లాంట్లను మూసేస్తున్నట్లు తెలిపింది.  దీనికి సంబంధిచి ఫోర్డ్‌ ఇండియా ట్విట్టర్‌ వేదికగా తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి సనంద్‌ ప్లాంట్‌ను,2022 రెండో త్రైమాసికం నాటికి చెన్నైలోని ప్లాంట్‌ను మూసివేస్తామని కంపెనీ ప్రకటించింది. 

భారతదేశంలో అమ్మే వాహనాల తయారీని ఫోర్డ్‌ ఇండియా వెంటనే నిలిపేస్తుంది. 2021 నాలుగో త్రైమాసికం నాటికి సనంద్‌లో వాహన అసెంబ్లీని మూసివేస్తుంది. 2022 రెండో త్రైమాసికం నాటికి చెన్నైలో వాహనం, ఇంజిన్‌ తయారీని నిలిపేస్తుందని తెలిపింది.