హర్యానా మాజీ సీఎం చౌతాలాకు జైలు శిక్ష

హర్యానా మాజీ సీఎం చౌతాలాకు జైలు శిక్ష

అక్రమాస్తుల కేసులో హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాకు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చేసింది. నాలుగేళ్ల జైలు శిక్ష.. రూ.50లక్షల జరిమానా విధించింది. చౌతాలాకు చెందిన నాలుగు ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. గతవారం చౌతాలాను దోషిగా నిర్ధారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు ఇవాళ శిక్ష ఖరారు చేసింది. 1999 నుంచి 2005వరకు సీఎంగా ఉన్న సమయంలో ఓం ప్రకాశ్ చౌతాలా అక్రమ ఆస్తులు కూడ బెట్టారన్న ఆరోపణలతో సుదీర్ఘ విచారణ జరిపింది సీబీఐ. 2006లో కేసు నమోదు చేసి.. 2010లో అధికారులు చార్జిషీట్ వేశారు. సీబీఐ కేసు నమోదు చేసిన 16ఏళ్ల తర్వాత ఓం ప్రకాశ్ చౌతాలాకు జైలు శిక్ష పడింది. ఓం ప్రకాశ్ చౌతాలా టీచర్స్ రిక్రూట్ మెంట్ స్కామ్ లో ఇప్పటికే పదేళ్ల జైలు శిక్ష అనుభవించారు.

మరిన్ని వార్తల కోసం

డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రారంభించిన హరీష్ రావు