Happy Life : డెన్మార్క్ దేశం వాళ్లు అంత హ్యాపీగా ఎందుకు ఉంటారు.. ఎలా ఉంటారు.. కారణాలు ఏంటీ..?

Happy Life : డెన్మార్క్ దేశం వాళ్లు అంత హ్యాపీగా ఎందుకు ఉంటారు.. ఎలా ఉంటారు.. కారణాలు ఏంటీ..?

సంతోషంగా బతకడమే సక్సెస్ ఫుల్ జీవితానికి అర్థం. అది ఎక్కడి నుంచో రాదు. పనుల్ని మనం సక్రమంగా చేసినప్పుడే వస్తుంది. హ్యాపీగా ఉంటే పెద్ద సమస్య కూడా చిన్నదిగా కనిపిస్తుంది! కానీ... ఇదంతా మన చుట్టూ ఉండే వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. అయితే హ్యాపీనెస్ లో మనం ఎంతో వెనుకబడి ఉన్నాం. చిన్న దేశమైన డెన్మార్క్ సంతోషంలో ముందుంది. వాళ్లు అంత సంతోషంగా ఎందుకున్నారనే గుట్టు వీడిందిప్పుడు..

గత పదేళ్లలో వరుసగా ఎనిమిదిసార్లు "అత్యంత సంతోషకరమైన" దేశాల జాబితాలో డెన్మార్క్ మొదటి స్థానంలో ఉంది. 2018, 2019 సంవత్సరాలకు ఫిట్నెస్  కంట్రీ' ఫిన్లాండ్ ఆ పొజిషన్ని దక్కించుకుంది. ఈ రెండేళ్లలో డెన్మార్క్ సెకండ్ ప్లేస్ కి పరిమితమైంది. మొత్తం మీద పదేళ్లు పరిశీలిస్తే 'వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్'లో టాప్ లో ఉంటోంది డెన్మార్క్. ఆ దేశ ప్రజలు సంతోషంగా ఉండటానికి అసలు కారణం 'సహానుభూతి. అంటే.. ఇతరుల్ని అర్థం చేసుకోవడంతోపాటు వాళ్ల సమస్యల పరిష్కారానికి వీలైనంత సాయం చేయడం. ఎంపతి (సహానుభూతి) ఫీలింగ్ ఆ దేశ ప్రజల్లో ఎక్కువగా ఉండటాన్ని మానసిక నిపుణులు గుర్తించారు. నిష్ ప్రజలు వాళ్ల పిల్లల్ని పెంచే విధానం ప్రత్యేకంగా ఉంటుందని చెబుతున్నారు.  'పేరెంటింగ్ లో శ్రద్ధ, క్రమశిక్షణలు ఎక్కువగా కనిపిస్తాయి. సహానుభూతితో పాటు సాయం చేసే గుణం ఎక్కువ ఉంది. అందుకే లైఫ్ లో సంతోషంగా ముందుకు సాగిపోతున్నారని తెలిపారు.

ఎంపతి.. సక్సెస్ మంత్ర

సంతోషానికేకాదు.. సక్సెస్ కి కూడా 'సహానుభూతి' కేరాఫ్ అడ్రస్ అంటున్నరు సైకాలజిస్టులు. అయితే దానిష్ ఫిలాసఫీకి 'ఎంపతి' గుండెలాంటిది. ఇది మనుషుల మధ్య సంబంధాలను చేస్తుందని.. డెన్మార్క్ జనాలు బలంగా నమ్ముతారు. ఎదుటివాళ్ల సమస్యేంటో తెలుసుకోవడంతోనే ఆగిపోకుండా.. బుర్రకు పదునుపెట్టి ఆ సమస్యను తీర్చడంలోనే ఆనందం ఉందనుకుంటారు. "ఎంపతి ఫీలింగ్లో బెదిరింపు వ్యవహారాలు ఉండవు. ఒకరికొకరు సహకరించుకుంటారు.
యువతలో అహం తగ్గి... లక్ష్యాన్ని సలువుగా అందుకుంటుంది. సక్సెస్పుల్ లీడర్లు, ఎంట్రప్రెన్యూర్లు, మేధావులు ఎందరో వెలుగులోకి వస్తారు. అందుకే స్కూల్ సిలబస్ లో సహానుభూతిని పాఠ్యాంశాలుగా చేర్చినట్లు" డెన్మార్క్ విద్యావేత్తలు చెప్తున్నారు. 

గ్రూప్ డిస్కషన్

డెన్మార్క్ స్కూళ్లలో ఎంపతి క్లాసు చెప్పాలనే రూల్ ఉంది. అదే విధంగా వారానికి ఒక గంట 'క్లాసెన్స్ టిడ్( క్లాస్ టైం) సెషన్స్ తప్పనిసరిగా నిర్వహించాలి. ఈ సెషన్ లో ఆరు నుంచి పదహారేళ్ల వయసున్న పిల్లలు, టీచర్లు పాల్గొంటారు. సోషల్ ఇష్యూన్ తో పాటు డెయిలీ లైఫ్ లో స్టూడెంట్స్ కి ఎదురయ్యే సమస్యలపై మాట్లాడుకుంటారు. ఆ సమ్యసకు ఒక పరిష్కారం కోసం అభిప్రాయాల్ని సేకరిస్తారు. ఒక నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి పంపిస్తారు. క్లాస్సెన్స్ భాష, వర్గం, మత, లింగ వివక్ష చూపించరు. ఎవరైనా స్వేచ్ఛగా తమ సమస్యలను, అభిప్రాయాలను చెప్పొచ్చు. అలాంటప్పుడు స్టూడెంట్స్ అంతా సమానం' అనే ఫీలింగ్ కలుగుతుంది.

చదువులో ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకెళ్తారు. ఇతరులకు సాయం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుందనే భావనని పిల్లల బ్రెయిన్ లో నాటాల్సిన బాధ్యత టీచర్దే. అంతేకాదు గ్రూప్ డిస్కషన్ల వల్ల స్టూడెంట్స్ లోని బలాలు, బలహీనతలను టీచర్ గుర్తించే అవకాశం ఉంటుంది. బలహీనతల నుంచి వాళ్లను బయటపడేసే అవకాశం దొరుకుతుంది.

పిల్లలు ఎదుర్కొనే సమస్యల్లో 60శాతం క్లాసెన్స్ టిడ్ ద్వారానే పరిష్కారం అవుతున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే!. స్కూల్ దశలోనే స్టూడెంట్స్ తో సమస్యల గురించి చర్చించడం, వాళ్లలో సహానుభూతి భావనను పెంపొందించడం వల్ల హ్యాపీ సొసైటీలో భాగమవుతున్నారు టీచర్లు. ఒకవేళ చర్చించడానికి ఏ టాపిక్ దొరక్కపోతే "హూ'లో భాగంగా అంతా సరదాగా గడుపుతారు.

హూ... పుట్టిందిక్కడే

డానిష్ లైఫ్ ట్రెండ్ 'హూగౌ'. ప్రపంచంలోని చాలా దేశాలు ఈ ట్రెండ్ ని ఫాలో అవుతున్నాయి. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా సంతోషంగా గడపడమే హూగ ఉద్దేశం. అందుకోసం ప్రత్యేకమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. సపోజ్ జోరుగా వానపడుతుందనుకోండి.. వేడి వేడిగా ఒక కప్పు, చాయ్ తాగుతూ ఫోన్ లో పాటలు వినడం, లేదంటే చలి మంట వేసుకుని స్నేహితులతో కబుర్లు చెప్పుకోవడం 'హూగ' ట్రెండ్ లో భాగం. ఈ విధంగా ఒత్తిళ్లకు దూరంగా సోషల్ లైఫ్ లో సరదాగా గడిపేందుకు ఎక్కువ టైం కేటాయిస్తున్నారు డెన్మార్క్ ప్రజలు. 'ఇలాంటివి చాలాసార్లు మేమూ చేశామంటారా?.. అయితే ట్రెండ్ ఫాలో అయినట్లే. అలాంటి
అనుభూతుల్ని #Hygge హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ఎంచక్కా షేర్ చేసుకోవచ్చు కూడా.