యాదగిరి గుట్ట ఆలయంలో చింతపండు చోరీ ఘటన.. నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

యాదగిరి గుట్ట ఆలయంలో చింతపండు చోరీ ఘటన.. నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి అలయ ప్రసాద విక్రయశాలలో విధులు నిర్వహించిన నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది.  ఈ మేరకు ఆలయ ఈఓ వెంకట్రావు సోమవారం (జూన్ 30) ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరు ఉద్యోగులను సంజాయిషీ కోరుతూ చార్జీ మెమోలు ఇచ్చారు. ప్రసాద విక్రయశాలలో చింతపండు చోరీ ఘటనపై నియమించిన హైలెవల్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మొత్తం ఆరుగురు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు స్టోర్ గుమస్తాగా విధులు నిర్వహించిన సీనియర్ అసిస్టెంట్‎ను, ముగ్గురు సహాయకులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరు సూపరిండెంట్లను సంజాయిషీ కోరుతూ చార్జీ మెమోలు జారీ చేశారు. వివరణ ఇవ్వాలని ఆదేశించారు.