ఆధ్యాత్మికం:  విజయ ఏకాదశి వ్రతం.. శత్రువులపై విజయం సాధించే వ్రతం.. శ్రీరాముడు ఆచరించిన వ్రతం ఇదే..! 

ఆధ్యాత్మికం:  విజయ ఏకాదశి వ్రతం.. శత్రువులపై విజయం సాధించే వ్రతం.. శ్రీరాముడు ఆచరించిన వ్రతం ఇదే..! 

హిందూ ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మాఘమాసం కృష్ణ పక్షం ఏకాదశికి విజయ ఏకాదశి అంటారు.  మహాశివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి.  విజయ ఏకాదశికి చాలా విశిష్టత ఉందని పురాణాల ద్వారా తెలుస్తుంది.   ఈ ఏడాది ఫిబ్రవరి 13 వ  తేదీ  విజయ ఏకాదశి జరుపుకొనున్నారు. ఆరోజు ఏకాదశి వ్రతం పాటిస్తే ఎలాంటి కష్టాలైనా తొలగుతాయని.. శత్రువులపై విజయం సాధిస్తారని పురాణాల ద్వారా తెలుస్తుంది.  త్రేతా యుగంలో శ్రీరామచంద్రుడు కూ డా ఈ వ్రతాన్ని ఆచరించిన తరువాతే రావణాసురుడిపై యుద్దం చేసి విజయం సాధించాడని ఇతిహాసాల ద్వారా తెలుస్తుంది.

పద్మ పురాణం ప్రకారం, సీతాదేవిని వెతుకుతూ శ్రీరాముడు తన వానర సేనతో కలిసి సముద్ర తీరానికి చేరుకున్నప్పుడు, ఆ అగాధమైన సముద్రాన్ని దాటడం పెద్ద సవాలుగా మారింది. అప్పుడు లక్ష్మణుడి సూచన మేరకు రాముడు సమీపంలోని బకదాల్భ్య ముని ఆశ్రమానికి వెళ్లాడు. సముద్రాన్ని దాటి లంకను జయించే మార్గాన్ని తెలపమని కోరగా, ఆ మహర్షి ‘విజయ ఏకాదశి’ వ్రతాన్ని ఆచరించమని సూచించారు. ఈ వ్రత ప్రభావం వల్ల సముద్రాన్ని దాటడమే కాకుండా, రావణుడిపై విజయం కూడా తథ్యమని ముని తెలిపారు. శ్రీరాముడు తన సేనతో కలిసి ఈ వ్రతాన్ని అత్యంత భక్తితో ఆచరించి, చివరకు లంకను జయించి సీతమ్మను తీసుకువచ్చారు.

విజయ ఏకాదశి తేదీ, శుభ ముహూర్తం

  • ఏకాదశి తిథి ప్రారంభం: ఫిబ్రవరి 12, 2026 (గురువారం) ఉదయం 11:32 గంటలకు.
  • ఏకాదశి తిథి ముగింపు: ఫిబ్రవరి 13, 2026 (శుక్రవారం) మధ్యాహ్నం 01:30 గంటలకు.
  • వ్రత సమయం: ఉదయ తిథిని పాటించే వారు ఫిబ్రవరి 13, శుక్రవారం నాడు ఉపవాసం ఉండాలి.

విజయ ఏకాదశి ( ఫిబ్రవరి13) ఉపవాస దీక్షను పాటించాలి.  ఈ పవిత్రమైన రోజున  లక్ష్మీనారాయణులను పూజిస్తే ప్రతి పనిలో విజయం సాధించడంతో పాటు.. మరణం తరువాత మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.  ఫిబ్రవరి 13 విజయ ఏకాదశి రోజున తెల్లవారుజామున  నదిలో స్నానం చేయాలి.  అవకాశం లేని వారు ఇంట్లో బావి వద్ద గాని.. కుళాయి వద్దగాని స్నానమాచరించాలి. స్నానం చేసేటప్పుడు కొద్దిగా గంగా జలంకాని..పుణ్య నదుల తీర్థం కాని కలుపుకుంటే మంచిదని పండితులు 

విజయ ఏకాదశి ప్రాముఖ్యత


విజయ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి ఎల్లప్పుడూ విజయం లభిస్తుంది. ఈ వ్రతం పాటించడం వల్ల పూర్వం రాజులు, చక్రవర్తులు చాలా యుద్ధాలలో విజయం సాధించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఉపవాసం ఆచరించి విష్ణువుని పూజించిన వారికి శత్రువులు ఎటువంటి పరిస్థితుల్లో కలిగించిన వాటి నుంచి బయటపడగలుగుతారు. బాధల నుంచి విముక్తి కలుగుతుంది. గత జన్మలో చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.


ఏకాదశి రోజు పఠించాల్సిన మంత్రాలు

 

  • ఓం నారాయణాయ లక్ష్మీ నమః...  అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం వల్ల మంచి ఉద్యోగం పొందుతారు.
  • ఓం సీతాపతే రామ్ రామాయ నమః..  అనే మంత్రాన్ని జపించడం వల్ల మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి.
  • ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పాటించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయి.

ఏకాదశి రోజు చేయాల్సిన పనులు

  • విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించాలి.
  • రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. 
  • ఉపవాసదీక్షను పాటించాలి.  
  • విష్ణుమూర్తికి పసుపు, కుంకుమ, అరటిపండ్లు నైవేద్యంగా పెట్టడం వల్ల దాంపత్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. 
  • ఆరోజు  ( ఫిబ్రవరి 13) న  వీలయినంతవరకు దానాలు చేయండి.
  • రోజంతా భగవత్​ ధ్యానంలో గడపాలి.. 
  • కింద చాప కాని.. దుప్పటి కాని వేసుకొని పడుకోవాలి.

ఏం చేయకూడదు

  •  విజయ ఏకాదశి నాడు అన్నం తినకూడదు.
  •  అబద్ధాలు చెప్పకూడదు. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సమస్యలు మరింత పెరుగుతాయి. 
  • సాత్విక ఆహారాన్ని  ( పాలు.. పండ్లు) తీసుకోవాలి. 
  • మాంసం, ఆల్కహాల్, ఉల్లిపాయలు, లేదా వెల్లుల్లి తీనకూడదు... ధూమపానం చేయకూడదు. 
  • ఎవరిని కించపరచకూడదు.. అవమానించకూడదు.
  • ఏ జీవికి ఎలాంటి హాని తలపెట్టకూడదు. 
  • మంచంపై కూర్చోకూడదు.. పడుకోకూడదు..