యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తండేల్’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 2025 ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజై వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తైన సందర్భంగా హీరో నాగ చైతన్య ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తన కెరీర్లో మైల్ స్టోన్ మూవీ అయిన ‘తండేల్’ను విజయవంతం చేసిన అభిమానులు, ప్రేక్షకులు మరియు చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
ALSO READ : ప్రభాస్ 'స్పిరిట్' నుండి ప్రకాష్ రాజ్ అవుట్?
ఈ చిత్రంలో రాజు–సత్యల మధ్య ప్రేమకథ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ పాత్రల్లో నటించిన నాగ చైతన్య, సాయి పల్లవిలకు ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభించాయి. వీరిద్దరి సహజ నటన, అద్భుతమైన కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘తండేల్’ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.
1 year for #Thandel thank you all for making this special , sending out love to the entire team :) #Dhullakotteyala@Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP @GeethaArts #AlluAravind @TheBunnyVas @_riyazchowdary @Shamdatdop @NavinNooli @KarthikTheeda @Srinagendra_Art… pic.twitter.com/KDDAtfLYCi
— chaitanya akkineni (@chay_akkineni) February 7, 2026
తండేల్ కథ:
తండేల్ మూవీ శ్రీకాకుళం మత్స్యకారుడు రాజు జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఇందులో రాజు-సత్యల మధ్య ఉన్న ప్రేమకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. రాజు సముద్రంలోకి చేపల వేటకి వెళ్లడం, ఆ తర్వాత 22 మందితో కూడిన 3 బొట్లు పాకిస్థాన్ సరిహద్దుకు చేరడం, దాంతో అక్కడి పాకిస్థాన్ జైల్లో బంధించబడటం వంటి అంశాలు బాగా ఆసక్తిగా మారాయి. అక్కడి నుండి రాజు బయటపడి బుజ్జితల్లి ప్రేమను దక్కించున్నాడా లేదా అనేది ప్రధాన కథగా తండేల్ రూపొందింది.
ALSO READ : థియేటర్లలో రొమాన్స్ జాతర
నాగచైతన్య సినిమాలు:
నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో వస్తున్న ‘వృషకర్మ’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తి కాగానే, అంటే 2026 రెండో అర్ధభాగంలో 'దూత 2' షూటింగ్ పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే 'దూత' మొదటి సీజన్‌ను నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించగా, ఈసారి ఈ క్రేజీ సీక్వెల్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ స్వయంగా నిర్మించబోతున్నట్లు సినీ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది. చైతన్య తన సొంత బ్యానర్‌లోనే ఈ భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నారట.
#VRUSHAKARMA it is for #Nc24 .@karthikdandu86 has something special coming your way for sure !
— chaitanya akkineni (@chay_akkineni) November 23, 2025
@Meenakshiioffl @BvsnP @aryasukku #SparshShrivastava #RagulDHerian @AJANEESHB @Srinagendra_Art @NavinNooli @SVCCofficial @SukumarWritings @Vrushakarma @Tseries @TseriesSouth pic.twitter.com/fwZbl0qxtO
