School holidays: తెలంగాణలో స్కూళ్లకు.. జూలై నెలలో ఏడు రోజులు సెలవులు

School holidays: తెలంగాణలో స్కూళ్లకు.. జూలై నెలలో ఏడు రోజులు సెలవులు

తెలంగాణలోని పాఠశాలలకు జూలై నెలలో మొత్తం 7 రోజుల సెలవులు వచ్చాయి. వీటిలో ఆదివారాలు, రెండో శనివారం, మొహర్రం, బోనాల పండుగలకు సంబంధించి సెలవులు కలిసి ఉన్నాయి. జూలై నెలలో 4 ఆదివారాలు (జూలై 6, 13, 20, 27) ఉన్నాయి. అదేవిధంగా జూలై 12న రెండో శనివారం సెలవు ఉంటుంది. 

మొహర్రం..ఇక జూలై నెలలో రెండు పండుగలు వచ్చాయి. జూలై 5న మొహర్రం ముందు రోజు ఆప్షనల్ హాలిడే, జూలై 6న (ఆదివారం) మొహర్రం సెలవు ఉంది. నెలవంక ఆలస్యమైతే జూలై 7న కూడా సెలవు ఉండే అవకాశం ఉంది.

బోనాలు..ఆదివారం(జూలై 20న) హైదరాబాద్ బోనాలు ..జూలై 21న బోనాల ఊరేగింపు సందర్భంగా హైదరాబాద్‌లోని పాఠశాలలకు ఐచ్చిక సెలవు ఉంటుంది. సికింద్రాబాద్ బోనాలు (జూలై 13 ఆదివారం) ,రంగం, ఊరేగింపు (జూలై 14 సోమవారం) సందర్భంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని పాఠశాలలకు కూడా సెలవు ఉండవచ్చు.

మొత్తంగా ఆదివారాలు, రెండో శనివారం, మొహర్రం, బోనాల పండుగ సెలవులను కలుపుకుంటే తెలంగాణ పాఠశాలలకు జూలై నెలలో 7 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి.