
గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST) స్ట్రక్చర్ ను మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. దివాళి వరకు జీఎస్టీ సంస్కరణలు తీసుకురానున్నట్లు స్వాతంత్ర్య వేడుకల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఉన్న జీఎస్టీ స్లాబులను కుదించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా 5%, 18% స్లాబులకు తీసుకువచ్చేందుకు కసరత్తులు చేస్తోంది.
అయితే సిన్ గూడ్స్ (పాపపు వస్తువులు) ను మాత్రం ప్రత్యేక స్లాబ్ కింద 40% జీఎస్టీ స్లాబ్ కింద ఉంచాలని భావిస్తోంది. అందుకు సంబంధించిన ప్రపోజల్ ను జీఎస్టీ కౌన్సిల్ కు కేంద్రం పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇప్పటి వరకు జీఎస్టీ ఐదు స్లాబుల కింద ఉంది. –0%, 5%, 12%, 18%, 28% గా ఐదు శ్లాబులుగా ఇప్పటి వరకు జీఎస్టీ ఉంది .ఇందులో 12%, 18% స్లాబులు స్టాండర్డ్ రేట్లు. ఎక్కువ భాగం వస్తువులు ఈ స్లాబ్ కిందికే వస్తాయి. ఈ 12 శాతం శ్లాబును తొలగించి 5%, 18% శ్లాబుల కిందికి తీసుకురావాలని ఆర్బీఐకి సిఫారసు చేసింది కేంద్రం ప్రభుత్వం.
కొత్త జీఎస్టీ శ్లాబుల వలన వ్యవసాయ ఉత్పత్తులపై ట్యాక్స్ తగ్గుతుంది. అదే విధంగా హెల్త్ రిలేటెడ్ ఐటెమ్స్, రీటైల్, చేనేత, ఇన్సురెన్స్ మొదలైన రంగాలపై పన్నులు తగ్గీ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. కంన్జంప్షన్ పెరగడంతో ఎకానమీకి ఇది బూస్ట్ ఇవ్వనున్నట్లు కేంద్రం భావిస్తోంది.