Gold Rate: శుక్రవారం తగ్గిన గోల్డ్.. తెలంగాణలో తులం రేటు ఇలా..

Gold Rate: శుక్రవారం తగ్గిన గోల్డ్.. తెలంగాణలో తులం రేటు ఇలా..

Gold Price Today: ఆగస్టు 14న ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగిన గోల్డ్ రేట్లు ఆగస్టు 15న స్వల్పంగా తగ్గుదలను చూశాయి. ప్రధానంగా బులియన్ మార్కెట్లు ఇవాళ ట్రంప్ పుతిన్ మధ్య జరిగే అలాస్కా సమావేశంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే విషయంపై దృష్టిని కొనసాగిస్తున్నాయి. దీనికి తోడు సెప్టెంబర్ నెలలో ఫెడ్ కూడా వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాలు గోల్డ్ రేట్లను తగ్గిస్తోంది. దీనికి కారణం గోల్డ్, సిల్వర్ లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు ఇతర సాధనాల్లోకి తమ డబ్బును తరలించటానికి ప్రయత్నించటమే. 

2025, ఆగస్ట్ 15వ తేదీ బంగారం ధరలు పరిశీలిస్తే.. 24 క్యారెట్ల బంగారం ధర 14వ తేదీ కంటే 10 గ్రాములకు 110 రూపాయలు తగ్గింది. అంటే గ్రాముకు రూ.11 స్వల్ప తగ్గుదలను నమోదు చేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో తగ్గిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే ఇలా ఉన్నాయి.  

ALSO READ : సరికొత్త రికార్డులకు బిట్‌కాయిన్..

24 క్యారెట్ల గ్రాము గోల్డ్ రేటు..

  • హైదరాబాద్: రూ.10వేల 124
  • వరంగల్: రూ.10వేల 124
  • కరీంనగర్: రూ.10వేల 124
  • విజయవాడ: రూ.10వేల 124
  • ప్రొద్దుటూరు: రూ.10వేల 124
  • వైజాగ్: రూ.10వేల 124
  • తిరుపతి: రూ.10వేల 124

ఇదే క్రమంలో 22 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే ఆగస్టు 14 తేదీతో పోల్చితే 10 గ్రాములకు ఆగస్టు 15న రూ.100 తగ్గింది. అంటే గ్రాముకు బంగారం రూ.10 మాత్రమే తగ్గింపును చూసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో తగ్గిన గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. 

22 క్యారెట్ల గ్రాము ధర..

  • హైదరాబాద్: రూ.9వేల 280
  • వరంగల్: రూ.9వేల 280
  • కరీంనగర్: రూ.9వేల 280
  • విజయవాడ: రూ.9వేల 280
  • ప్రొద్దుటూరు: రూ.9వేల 280
  • వైజాగ్: రూ.9వేల 280
  • తిరుపతి: రూ.9వేల 280

ఇక సామాన్యుల బంగారంగా చెప్పుకునే వెండి రేట్లను గమనిస్తే.. ఆగస్టు 15న కేజీకి రూ.100 పెరుగుదలను చూసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి రేటు రూ.లక్ష 26వేల 100కు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.126.10 అనమాట.