
ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచాన్ని శాసించిన రెండు అగ్ర రాజ్యాల నేతలు.. చాలా రోజుల తర్వాత కలుస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ భేటీతోనైనా ప్రపంచంలోని అనిశ్చిత్తిని తొలగించే దిశగా ఉంటుందని చూస్తున్నాయి దేశాలు. యుద్ధాలు, టారిఫ్ వార్లకు ఎండ్ పడుతుందేమోనని ఊహాగానాలు మొదలయ్యాయి.
యూఎస్ ప్రసిడెంట్ ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీతో ఎన్నాళ్లుగానో యుద్ధంలో చిక్కుకుపోయిన తమ దేశానికి గుడ్ న్యూస్ వస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆశిస్తున్నారు. ఇది యుద్ధాన్ని ముగించాల్సిన సమయం. యూఎస్ గుడ్ న్యూస్ చెబుతుందని ఆశిస్తున్నామని ఆయన స్టేట్ మెంట్ ఇచ్చారు.
అమెరికాలోని అలాస్కాలో జరగనున్న ఈ భేటీ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ప్రతిపాదనలపై ట్రంప్, పుతిన్ ల మధ్య చర్చ జరగనుంది. యుద్ధానికి ముగింపు పలకలేని పరిస్థితి ఉంటే ఇది బ్యాడ్ మీటింగ్ గా భావిస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అంటే యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే నిర్ణయంలో ఉన్నారు ట్రంప్.
మరోవైపు ట్రంప్- పుతిన్ చర్చల ఫలితాల ఆధారంగా భారత్‌పై సుంకాలపై ఒక క్లారిటీ రానుంది. చర్చలు సఫలం అయితే సుంకాలు తగ్గించే ఛాన్స్ ఉంది. చర్చలు ఫలిస్తే ఇరు దేశాల మధ్య స్నేహపూరిత వాతావరణం ఏర్పడుంది. దీంతో రెండు దేశాలు ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటాయి. దీని వలన రష్యాపై ట్రంప్ సాంక్షన్స్ తగ్గిస్తారు. దీంతో రష్యాతో భారత్ వాణిజ్యంపై యూఎస్ కు అంతగా అభ్యంతరాలు ఉండవు. టారిఫ్ లు తగ్గించే ఛాన్స్ ఉంటుంది. కానీ చర్చలు విఫలమైతే భారత్‌పై మరిన్ని సుంకాలు విధించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విషయాన్ని అమెరికా ప్రకటించి ఉంది.