రంగారెడ్డి జిల్లాలో BRS కు బిగ్ షాక్.. కీలక నేతతో పాటు 250 మంది కార్యకర్తలు కాంగ్రెస్లో చేరిక

రంగారెడ్డి జిల్లాలో BRS కు బిగ్ షాక్.. కీలక నేతతో పాటు 250 మంది కార్యకర్తలు కాంగ్రెస్లో చేరిక

రంగారెడ్డి జిల్లాలో BRS కు బిగ్ షాక్ తగిలింది. పార్టీకి చెందిన కీలక నేతతో పాటు 250 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం (ఆగస్టు 15) రాజేంద్ర నగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ నేతలు మూకుమ్మడిగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. 

బి ఆర్ ఎస్ పార్టి కీ చెందిన సంఘసేవకుడు సోమ శ్రీనివాస్ గుప్తా తో పాటు సుమారు 250 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

 కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఈ సందర్భంగా సోమ శ్రీనివాస్ గుప్తా అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ధనుంజయ్, రాము గౌడ్, ప్రేమ్ గౌడ్, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

►ALSO READ | టోల్ తిప్పలు ఇప్పట్లో తప్పేలా లేవు.. ఇయర్లీ టోల్ పాస్ తెలంగాణ వెహికిల్స్కు అమలు కాదంట !