వికారాబాద్, వెలుగు: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల లబ్ధిదారులు మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని, దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి నేరుగా ప్రభుత్వం నుంచి చెక్కులు అందుతాయని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు.
బుధవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలానికి చెందిన 72 మందికి కల్యాణలక్ష్మి, 9 మందికి షాదీ ముబారక్, 30 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
