టోల్ తిప్పలు ఇప్పట్లో తప్పేలా లేవు.. ఇయర్లీ టోల్ పాస్ తెలంగాణ వెహికిల్స్కు అమలు కాదంట !

టోల్ తిప్పలు ఇప్పట్లో తప్పేలా లేవు.. ఇయర్లీ టోల్ పాస్ తెలంగాణ వెహికిల్స్కు అమలు కాదంట !
  • రూ.3 వేలకు 200 ట్రిప్పులు
  • వాహనదారులపై భారం తగ్గించే స్కీమ్ 
  • వాహన్ పోర్టల్ లో అనుసంధానం కాని తెలంగాణ వెహికిల్స్

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై ఇవాల్టి నుంచి (ఆగస్టు 15) అమల్లోకి వచ్చిన వార్షిక టోల్ పాస్ స్కీమ్.. తెలంగాణ వాహన దారులకు ఉపయోగం లేకుండా పోయింది. రాష్ట్రానికి చెందిన వెహికల్స్ వాహన్ పోర్టల్ లో నమోదు కాకపోవడమే ఇందుకు కారణం. 

కేంద్ర రవాణా శాఖ తీసుకొచ్చిన ఈ కొత్త విధానంలో కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర వెహికల్స్ కు  హైవేలపై టోల్ గేట్ల వద్ద వార్షిక ఫాస్టాగ్ పాస్ స్కీమ్ అమలు చేస్తున్నా రు. వాహనదారులు రూ.3 వేలు చెల్లించి ఈ వార్షిక పాసు తీసుకుంటే ఏడాదిలో 200 సార్లు ఉచితంగా టోల్దేట్ గుండా వెళ్లేందుకు అను మతిస్తారు. అంటే సగటున ఒక్కసారి టోల్ గేట్ దాటేందుకు రూ.15 ఖర్చు అవుతోంది. 

అప్పటికే ఫాస్టాగ్ కలిగిన వాహనదారులకు ఇది అమలు చేస్తామని, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి దీన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వర్తిస్తున్న ఈ వార్షిక టోల్ పాస్ స్కీమ్ ఒక్క తెలంగాణ మాత్రం బెనిఫిట్ లేకుండా పోయింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ కేంద్ర రవాణా శాఖ రాష్ట్ర ప్రభు త్వానికి లేఖ కూడా రాసింది.