Krishna Janmashtami 2025 : శ్రీ కృష్ణుడి ఫుడ్ డైట్ ఇప్పటికీ అల్టిమేట్ : ఒక్కసారి ఆచరించి చూడండీ.. ఆరోగ్యమే ఆరోగ్యం

Krishna Janmashtami 2025 : శ్రీ కృష్ణుడి ఫుడ్ డైట్ ఇప్పటికీ అల్టిమేట్ : ఒక్కసారి ఆచరించి చూడండీ.. ఆరోగ్యమే ఆరోగ్యం

శ్రీకృష్ణుడి జీవితం అంటే మనకు జ్ఞానం, మంచి మనసు, దైవంతో ఉన్న అనుబంధం గుర్తుకొస్తాయి. అయితే ఆయన కథల్లో ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. అదే  ఆయన తినే సాత్విక ఆహారం. మన పాత సంప్రదాయాలను బట్టి చూస్తే ఈ సాత్విక ఆహారం మన శరీరాన్ని, మనసుని శుభ్రంగా, తేలికగా ఉంచుతుంది.

ఈరోజుల్లో కీటో, ఉపవాసాలు, డిటాక్స్ లాంటి డైట్లు చాలా పెరిగిపోయాయి. కానీ శ్రీకృష్ణుడి ఆహారం వెనుక ఉన్న ఆలోచన ఇప్పటికీ చాలా గొప్పది. ఈ ఆహారం మన శరీరాన్ని బరువుగా చేయకుండా, శక్తిని పెంచేలా ఉంటుంది. అన్ని కాలాలకి అనుగుణంగా తాజాగా దొరికే ఆహారాలు తినడం దీని ముఖ్య ఉద్దేశం. అందుకే కృష్ణుడి ఆహార విధానం ఈరోజుకీ ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఉదాహరణగా నిలుస్తుంది.

సాత్విక ఆహారం అంటే ఏమిటి: సాత్విక ఆహారం దీర్ఘాయువు, బలం, ఆనందం, సంతృప్తిని పెంచుతుందని భగవద్గీత చెబుతోంది. బృందావనంలో గోవులను మేపడం నుండి కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడిని నడిపించడం వరకు శ్రీకృష్ణుడు ఎప్పుడు చాలా చురుగ్గా ఉండేవాడు కాబట్టి, ఈ ఆహారం  ఆయన శరీరాన్ని బలంగా, ఆలోచనలను పదునుగా ఉంచింది. సాత్విక అనేది సంస్కృత పదం. దీని అర్థం స్వచ్ఛత, ప్రశాంతత. సాత్విక ఆహారం అంటే ఎక్కువగా పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, గింజలు, పాలు, నెయ్యి లాంటి పాల పదార్థాలతో ఉంటుంది. ఇందులో ప్రాసెస్ చేసిన, పాడైన లేదా నిల్వ ఉంచిన ఆహారాలను తినరు. అందుకే ఇది మన శరీరం, మనసుపై చెడు ప్రభావం చూపించదు.

కృష్ణుని ఆహారంలో  ముఖ్యమైనవి:
*కృష్ణుడి ఆహారంలో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి చాలా ముఖ్యమైనవి. ఇవి కాల్షియం, ప్రోబయోటిక్స్ ఇంకా ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి.
*సీజన్‌లో లభించే పండ్లు : విటమిన్లు, సహజ చక్కెరతో ఉన్న అరటిపండ్లు, బెర్రీలు, పుచ్చకాయలు.
*తృణధాన్యాలు - బార్లీ, బియ్యం, గోధుమలు శరీరాన్ని బరువుగా అనిపించకుండా శక్తిని ఇస్తాయి.
*పప్పుధాన్యాలు - కందులు, శనగలు, పేసర్లు మొక్కల నుంచి వచ్చేవి శరీరానికి కావలసిన ప్రోటీన్లను అందిస్తాయి.

సాత్విక ఆహారం ఎందుకు మంచిదంటే: ఈ రోజుల్లో పోషకాహార నిపుణులు కూడా సాత్విక ఆహారంలోని సూత్రాలు సరైనవే అని చెబుతున్నారు. ఎందుకంటే ప్రాసెస్ చేయని, తాజా ఆహారాలలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా షుగర్, బీపీ లాంటి జబ్బులు రాకుండా కాపాడతాయి. సాత్విక పద్ధతిలో తినడం అంటే మనసు పెట్టి తినడం. అంటే మనం తినేటప్పుడు ఎలాంటి ఆలోచనలు లేకుండా సరైన టైంకి  ఆహారం  తినాలి. ఎందుకంటే మనం తినే ఆహారం కేవలం కడుపు నింపడానికి మాత్రమే కాదు మన మనసుని, ఆత్మని కూడా ప్రశాంతంగా ఉంచుతుంది.

నేటి బిజీ బిజీ లైఫ్ స్టయిల్లో  కూడా కృష్ణుడి సాత్విక ఆహారం అలవాటు చేసుకోవడం చాల సులభం:
*సీజన్‌కు అనుగుణంగా ప్రాసెస్ చేసిన స్నాక్స్‌ బదులు తాజా పండ్లతో తీసుకోండి. 
*సులభంగా జీర్ణం కావడానికి భోజనంలో నెయ్యి కలపండి.
*మధ్యాహ్నం లేదా రాత్రి భోజనంలో పప్పు, ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు ఉండేలా చూసుకోండి. 
*ఎక్కువగా చక్కెర, ఉప్పు, నూనె వాడకం తగ్గించండి.
*ఇలా పాటించడం ద్వారా మీరు మీ శరీరానికి ఆహారం అందించడమే కాకుండా ఆరోగ్యం, శక్తిని ప్రోత్సహించిన పురాతన సంప్రదాయానికి కట్టుబడి ఉంటారు.