
హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా కంటిన్యూగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు నగరం చుట్టుపక్కల ఉన్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండిపోయాయి. శుక్రవారం (ఆగస్టు 15) ఉదయం నుంచి కాస్త తెరిపి ఇచ్చిన వాన.. సాయంత్రం 9 గంటల నుంచి చిరు జల్లులతో మొదలై అక్కడక్కడ భారీ వర్షంగా మారుతోంది.
కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సుచిత్ర, కొంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, మల్లంపేట్, బౌరంపేట్, బహదూర్ పల్లి, సూరారం, చింతల్, జీడిమెట్ల , షాపూర్ నగర్, గాజులరామారంలో వాన పడుతోంది.
మరోవైపు మేడ్చల్, అల్వాల్, శామీర్ పేట, జవహర్ నగర్ ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. వాహనదారులు షాపింగ్ కాంప్లెక్స్ లు, షెటర్ల కింద తలదాచుకుంటున్నారు.
►ALSO READ | రంగారెడ్డి జిల్లాలో BRS కు బిగ్ షాక్.. కీలక నేతతో పాటు 250 మంది కార్యకర్తలు కాంగ్రెస్లో చేరిక
ఇటు మియాపూర్ ఏరియాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో వర్షం దంచి కొడుతోంది. ఒకటి రెండు నిమిషాల వానకే రోడ్డుపై వరద ప్రవహించేంత వాన కురుస్తోంది మియాపూర్ లో. నిజాంపేట్ లోనూ వాన పడుతోంది.
9 గంటల తర్వాత మొదలైన వాన మెల్ల మెల్లగా నగరం అంతా వ్యాపిస్తోంది. ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, రామంతపూర్, తార్నాక, ఓయూ లలో వర్షం కురుస్తోంది.
ఇంటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ, అమీర్ పేట్, బోరబండ, ఎర్రగడ్డ, ఫిలింనగర్ ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాకు వ్యాపించింది వర్షం. నగరం అంతా వర్షం చుట్టేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇటు ఖైరతబాద్, లక్డీకాపూల్ప్రాంతాల్లో తేలిక పాటి జల్లులు కురుస్తున్నాయి.
రానున్న రెండు మూడు గంటల్లో హైదరాబాద్ నగరంలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చిరు జల్లుల నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. అవసరం ఉంటే తప్ప బయటకు రాకపోవడం బెటర్ అని సూచించారు.