ఫ్లైఓవర్ మీదినుంచి బాంబేశారు: ఢాకాలో భారీ పేలుడు.. ఒకరు మృతి

ఫ్లైఓవర్ మీదినుంచి బాంబేశారు: ఢాకాలో భారీ పేలుడు.. ఒకరు మృతి

ఢాకా: అల్లర్లతో అట్టుడుకుతోన్న బంగ్లాదేశ్‎లో భారీ పేలుడు సంభవించింది. బుధవారం (డిసెంబర్ 24) రాత్రి బంగ్లా రాజధాని ఢాకాలోని మొఘ్‌బజార్ ఫ్లైఓవర్ సమీపంలో శక్తివంతమైన బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. భారీ పేలుడుతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన ప్రజలు పరుగులు తీశారు. 

స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు సహయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించారు. మృతుడిని 21 ఏళ్ల సియామ్‎గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. 

►ALSO READ | కెనడాలో దారుణం..భారతీయ మహిళ కిడ్నాప్, హత్య

పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం (డిసెంబర్ 24) రాత్రి 7:10 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు మొఘ్‌బజార్ ఫ్లైఓవర్ మీద నుంచి ఒక బాంబును విసిరారు. అది కింద ఉన్న జన సముహంలో పడి భారీ శబ్ధంతో పేలింది.  ఈ ఘటనలో సైఫుల్ సియామ్ (21) అనే యువకుడు అక్కడికక్కడే మరణించాడు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు జరిగిన వెంటనే అత్యవసర బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. 

క్షతగాత్రులను అత్యవసర చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న సీనియర్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మార్కెట్ రద్దీగా ఉన్న సమయంలో ఈ పేలుడు సంభవించడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తు్న్నారు. స్టూడెంట్ లీడర్ ఇస్మాయిల్ హాదీ హత్యతో బంగ్లాదేశ్‎లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే.