GHMC చట్ట సవరణపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

GHMC చట్ట సవరణపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చట్ట సవరణపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పలు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‎పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల ఉన్న 20 మున్సిపాలిటీలు,7  కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీలో విలీనమైన 27 మున్సిపాలిటీల్లో తుక్కుగూడ కూడా ఒకటి. 

ఈ క్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎలాంటి అభిప్రాయాలు తీసుకోకుండా తుక్కుగూడ మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో విలీనం చేశారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్‎పై బుధవారం (డిసెంబర్ 24) విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్‏పై విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. 

►ALSO READ | మాదాపూర్ తమ్మిడికుంట, కూకట్ పల్లి నల్ల చెరువు పనులు పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్