
హానర్, షియోమి సహా కొన్ని చైనీస్ కంపెనీలు ఇప్పుడు పెద్ద బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయాలనీ పోటీ పడుతున్నాయి. సమాచారం ప్రకారం హానర్ 10000mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌పై పనిచేస్తోందని తెలుస్తుంది. అలాగే షియోమి సబ్-బ్రాండ్ రెడ్‌మి కూడా 8500mAh నుండి 9000mAh బ్యాటరీతో కొత్త ఫోన్‌పై తీసుకురావాలని చూస్తోంది. విషయం ఏంటంటే సిలికాన్-కార్బన్ టెక్నాలజీతో ఈ కంపెనీలు ఇప్పుడు ఫోన్ మందాన్ని పెంచకుండా పెద్ద బ్యాటరీని అందించవచ్చు.
Redmi 9000mAh బ్యాటరీ ఫోన్: ఈ ఫోన్‌ను కంపెనీ సొంత టెక్నాలజీని ఉపయోగించి 9000mAh బ్యాటరీతో తయారు చేస్తోందని, ఇందులో సిలికాన్ కార్బన్ కాంపోజిట్ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను ఉపయోగించవచ్చని చెబుతున్నారు. బ్యాటరీ సైకిల్ లైఫ్ ఎఫెక్ట్ కాకుండా ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీని ఇన్‌స్టాల్ చేయడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది, దింతో దీని మందం 8.5mm కంటే తక్కువగా ఉండొచ్చు.
ఒకవేళ ఇదే నిజమైతే Redmi ప్రస్తుత స్మార్ట్‌ఫోన్లలో అతిపెద్ద బ్యాటరీ ఫోన్ ఇదే అవుతుంది. అంతేకాదు Redmi త్వరలో 8000mAh బ్యాటరీతో Redmi Turbo 5 Proని విడుదల చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. Redmi Turbo 4 Pro 7550mAh బ్యాటరీతో ఉండగా అంటే 5 Proలో 4 Pro కంటే పెద్ద బ్యాటరీ ఉంటుందని చెప్పొచ్చు.
ఇక రెడ్‌మికి పోటీగా మరో కంపెనీ 9000mAh బ్యాటరీ కంటే ఒక అడుగు ముందుకే ఆలోచిస్తోంది, అవును హానర్ కంపెనీ త్వరలో 10000 mAh బ్యాటరీతో ఫోన్‌ను కస్టమర్ల కోసం లాంచ్ చేయవచ్చు. ఇంత పెద్ద బ్యాటరీ టాబ్లెట్ వంటి పెద్ద సైజు వాటిలో మాత్రమే సాధ్యమవుతుంది కానీ హానర్ ఫోన్‌లో అంత పెద్ద బ్యాటరీని ఎలా అమర్చుతుందో ఆసక్తికరంగా మారింది. ఈ ఫోన్‌ను హానర్ పవర్ 2 అని పిలుస్తారు, ఇది హానర్ పవర్ కి అప్‌గ్రేడ్ వెర్షన్.