ఇంట్లోనే ఎక్సర్‌‌‌‌‌‌‌‌ సైజ్‌‌‌‌ చేసేవారికి బెస్ట్ డివైజెస్..

ఇంట్లోనే ఎక్సర్‌‌‌‌‌‌‌‌ సైజ్‌‌‌‌ చేసేవారికి బెస్ట్ డివైజెస్..

పెడల్ ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజర్

ఇంట్లో ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌ చేసేందుకు టైం లేనివాళ్లు దీంతో హాయిగా ఆఫీస్‌‌‌‌లోనే ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌ చేసుకోవచ్చు. ఈ కాంపాక్ట్ ఫోల్డింగ్ పెడల్ ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజర్​ను స్పార్నోడ్‌‌‌‌ అనే కంపెనీ తీసుకొచ్చింది. మజిల్‌‌‌‌ టోనింగ్‌‌‌‌, ఏకాగ్రతను మెరుగుపరచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు.. రక్త ప్రసరణను సమర్థవంతంగా పెంచుతుంది. దీనివల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఆఫీస్‌‌‌‌లో పని చేస్తున్నప్పుడు, ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు, వీడియో గేమ్‌‌‌‌లు ఆడుతున్నప్పుడు కూడా దీంతో ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌ చేయొచ్చు. 

దీని కాంపాక్ట్ ఫోల్డింగ్ డిజైన్ వల్ల ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఆఫీస్‌‌‌‌ డెస్క్ కింద కూడా పెట్టుకోవచ్చు. నాన్-స్లిప్, నాన్‌‌‌‌మార్కింగ్ ఫూట్స్‌‌‌‌తో వస్తుంది. టేబుల్‌‌‌‌టాప్, కార్పెట్, హార్డ్ ఫ్లోర్ ఇలా ఎక్కడైనా పెట్టుకొని వాడొచ్చు. దీనికి ఎల్‌‌‌‌సీడీ  మానిటర్‌‌‌‌ కూడా ఉంది. అందులో ఆర్‌‌‌‌‌‌‌‌పీఎం కౌంట్‌‌‌‌ డిస్‌‌‌‌ప్లే అవుతుంది.

వైబ్రేషన్‌‌‌‌ ప్లేట్‌‌‌‌

కష్టపడి ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌ చేయలేం అనుకునేవాళ్లకు ఈ వైబ్రేషన్‌‌‌‌ ప్లేట్‌‌‌‌ బెస్ట్‌‌‌‌ చాయిస్‌‌‌‌. టిస్‌‌‌‌స్కేర్‌‌‌‌‌‌‌‌ అనే కంపెనీ దీన్ని మార్కెట్‌‌‌‌లోకి తీసుకొచ్చింది. దీనిపై నిలబడి మెషిన్‌‌‌‌ని ఆన్‌‌‌‌ చేస్తే.. అది వైబ్రేట్‌‌‌‌ అవుతుంది. దానివల్ల బాడీ పూర్తిగా కదులుతుంది. దాంతో కొవ్వు కరిగిపోతుంది. శరీర ఆకృతి, మజిల్‌‌‌‌ టోనింగ్, జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇది సాయం చేస్తుంది. రన్నింగ్‌‌‌‌తో పోలిస్తే.. మూడు రెట్లు వేగంగా ప్యాట్‌‌‌‌ బర్న్‌‌‌‌ అవుతుందని దీని మేకర్స్ చెప్తున్నారు. 

దీని వైబ్రేషన్‌‌‌‌ స్పీడ్‌‌‌‌ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 99 స్పీడ్ సెట్టింగ్స్‌‌‌‌తోపాటు 5 ప్రీసెట్ మోడ్స్‌‌‌‌ ఉంటాయి. ఈ వైబ్రేటింగ్ ప్లేట్ కండరాల నొప్పిని కూడా తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కీళ్ల ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. దీన్ని రిమోట్‌‌‌‌తో ఆపరేట్‌‌‌‌ చేయొచ్చు. ఇందులో బ్లూటూత్ మ్యూజిక్ కూడా ఉంటుంది. టైం, స్పీడ్‌‌‌‌ని డిస్‌‌‌‌ప్లే చేసేందుకు ఎల్‌‌‌‌ఈడీ స్క్రీన్‌‌‌‌తో వస్తుంది. యాంటీ స్లిప్ బేస్‌‌‌‌తో రావడంతోపాటు ఇది 180 కిలోల బరువును తట్టుకోగలదు. ప్యాక్‌‌‌‌లో మెషిన్‌‌‌‌తోపాటు ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌ చేసేందుకు 2 రెసిస్టెన్స్ బ్యాండ్స్‌‌‌‌, రిమోట్‌‌‌‌ కూడా వస్తాయి. 

థై ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజర్‌‌‌‌‌‌‌‌

ఇంట్లోనే ఈజీగా పెల్విక్ మజిల్స్‌‌‌‌ ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌ చేసుకోవాలి అనుకునేవాళ్లకు ఈ గాడ్జెట్ బాగా సరిపోతుంది. ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంత్‌‌‌‌నర్​ని ఒలమ్లీ అనే కంపెనీ మార్కెట్‌‌‌‌లోకి తీసుకొచ్చింది. దీన్ని పెల్విక్ టోనింగ్, బ్లాడర్ కంట్రోల్ కోసం ప్రత్యేకంగా తయారుచేశారు. ఇది తొడ, నడుము, తుంటి, పొత్తికడుపు కండరాలను దృఢంగా మారుస్తుంది. దీన్ని మృదువైన, యాంటీ స్లిప్ సిలికాన్​తో తయారుచేశారు. స్ప్రింగ్- రెసిస్టెన్స్‌‌‌‌ని అడ్జస్ట్‌‌‌‌ చేసుకోవచ్చు. 

యోగా ప్రాక్టీస్‌‌‌‌ చేసేవాళ్ల నుంచి ఇప్పుడిప్పుడే ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌ చేయడం మొదలుపెట్టినవాళ్ల వరకు ఎవరైనా దీన్ని వాడొచ్చు. కాంపాక్ట్‌‌‌‌ సైజులో ఉండడం వల్ల ట్రావెలింగ్‌‌‌‌, ఆఫీస్, జిమ్‌‌‌‌.. ఇలా ఎక్కడికైనా దీన్ని తీసుకెళ్లొచ్చు. సీటెడ్, లైయింగ్ లేదా స్టాండింగ్ పొజిషన్‌‌‌‌లలో ఉపయోగించవచ్చు. అంతేకాదు.. దీనికి ఎల్‌‌‌‌సీడీ స్క్రీన్‌‌‌‌ కూడా ఉంటుంది. అందులో వర్కవుట్స్‌‌‌‌ కౌంట్‌‌‌‌ డిస్‌‌‌‌ప్లే అవుతుంది.