చెన్నూరు నియోజకవర్గంలో BRS కు బిగ్ షాక్.. మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన కీలక నేతలు

చెన్నూరు నియోజకవర్గంలో BRS కు బిగ్ షాక్.. మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన కీలక నేతలు

స్థానిక ఎన్నికల ముందు BRS కు బిగ్ షాక్ తగిలింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో కీలక నేతలు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి  కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో మాజీ సర్పంచ్ లు, , మాజీ కౌన్సిలర్ లు, కార్యకర్తలు మొత్తం 500 మంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 

బీ ఆర్ ఎస్ నుండి వచ్చిన నాయకులకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలకు ఆకర్షితులై పార్టీలో  చేరుతున్నట్లు ఈ సందర్భంగా నాయకులు చెప్పారు. 

ఈ సందర్భంగా మంత్రి వివేక్ కామెంట్స్:

  • చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.100 కోట్ల నిధులతో పనులు చేశాము.
  • మరో 400 కోట్ల రూపాయల తో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
  • కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతున్నాం
  • ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం, రుణమాఫీ, రైతు భరోసా అమలు చేశాం
  • కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచడం జరిగింది.
  • మూతపడ్డ ఆర్ ఎఫ్ సి ఎల్ సంస్థ పునరుద్ధరణ కోసం కృషి చేశా.
  • ఇప్పుడు అందులో 500 మంది ఉద్యోగాలు పొందారు.
  • యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం.
  • నేను నాయకుడిని కాదు మీలా నేను కూడా కార్యకర్తనే.
  • నా విజయానికి అహర్నిశలు కృషి చేసిన నా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాను.
  • నాకు ముందు చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధే మొదటి లక్ష్యం
  • 24 గంటలు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా.
  • ఎప్పుడైనా ఏ సమస్య వచ్చిన నాకు ఫోన్ చేయొచ్చు.
  • ఎమ్మెల్యే గా ఉన్నా..మంత్రి అయినా ప్రజలే నాకు ముఖ్యం.