సెల్లర్ల ఫీజును తగ్గించిన అమెజాన్.. మొదలైన ఈపీఎల్ సేల్

సెల్లర్ల ఫీజును తగ్గించిన అమెజాన్.. మొదలైన ఈపీఎల్ సేల్

హైదరాబాద్​, వెలుగు: అమెజాన్ ఇండియా తన సెల్లర్ల ఫీజులను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. రూ. వెయ్యి లోపు ధర కలిగిన 12.5 కోట్ల ఉత్పత్తులకు జీరో రిఫరల్ ఫీజు సౌకర్యం ఉంటుంది. దాదాపు1,800 కంటే ఎక్కువ కేటగిరీలలో ఈ వెసులుబాటు అందుబాటులో ఉంటుంది. 

రూ. 300 లోపు ధర కలిగిన ఉత్పత్తులపై ఈజీ షిప్ ఫీజును 20 శాతానికిపైగా తగ్గించింది. ఒకే బాక్సులో ఒకటి కంటే ఎక్కువ వస్తువులను పంపే వాళ్లు రెండో వస్తువుపై సెల్లింగ్​చార్జీలపై 90 శాతం కంటే ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. ఈ కొత్త నిబంధనలు ఈ నెల 16 నుంచి అమల్లోకి వస్తాయని అమెజాన్​ ప్రకటించింది.

మొదలైన ఈపీఎల్​ సేల్​
అమెజాన్ శుక్రవారం నుంచి ఎలక్ట్రానిక్స్  ప్రీమియర లీగ్ (ఈపీఎల్) ప్రారంభించింది.   స్మార్ట్‌‌‌‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లపై 65 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ కార్డులపై రూ. 4,500 వరకు ఇన్​స్టంట్​ డిస్కౌంట్ పొందవచ్చు. శామ్​సంగ్​ గెలాక్సీ ఎస్26 అల్ట్రా, యాపిల్ 17ఈ వంటి తాజా మోడళ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. కస్టమర్లకు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడంలో రఫూస్ వంటి ఏఐ టూల్స్ సహాయపడతాయి. ఈ సేల్ మార్చి 12 వరకు కొనసాగుతుందని కంపెనీ తెలిపింది.