గత కొంతకాలంగా హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో గ్లోబల్ స్టార్‌గా వెలుగుతున్న ప్రియాంక చోప్రా.. మార్చి 15న జరగబోతున్న ఆస్కార్ వేడుకలో మెరవబోతోంది. ఆస్కార్ అవార్డ్స్ 2026 ప్రజెంటర్స్ లిస్ట్‌ను అకాడమీ అనౌన్స్ చేయగా, అందులో ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా నిలిచింది.
ఐరన్ మ్యాన్ ఫేమ్ రాబర్ట్ డౌనీ జూనియర్, గ్వినేత్ పాల్ట్రో, అన్నే హాథ్‌వే, పాల్ మెస్కల్ వంటి దిగ్గజాలతో కలిసి ఆమె అవార్డ్స్ ప్రజెంటర్‌గా వ్యవహరించబోతోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది ప్రియాంక. అకాడమీ అవార్డ్స్ ప్రజెంటర్‌గా ఆమె వ్యవహరించడం ఇది రెండోసారి.
Meet your third slate of presenters for the 98th Oscars.
— The Academy (@TheAcademy) March 5, 2026
Watch the #Oscars LIVE Sunday, March 15, at 7e/4p on ABC and Hulu, with Conan O’Brien hosting. #OnlyAtTheOscars pic.twitter.com/NEdABQDnMA
గతంలో 2016లో జరిగిన ఎనభై ఎనిమిదవ ఆస్కార్ వేడుకలో పాల్గొన్న ఆమె.. ఆ ఏడాది బెస్ట్ ఎడిటింగ్ విభాగంలో విన్నర్‌కు అవార్డును అందజేసింది. సరిగ్గా పదేళ్ల తర్వాత మళ్లీ ఈ వేదికపై ఆమె మెరవబోతోంది. ఇక లాంగ్ గ్యాప్ తర్వాత మహేష్ బాబు హీరోగా వస్తున్న ‘వారణాసి’ సినిమాతో ఆమె ఇండియన్ సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తోంది.
మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ టైమ్ ట్రావెల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం జోర్డాన్‌లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఇటీవల ఈ షెడ్యూల్ పూర్తిచేసుకుని యూఎస్ చేరుకుంది ప్రియాంక. తర్వాతి షెడ్యూల్ అంటార్కిటికాలో ఉండబోతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
Meet your third slate of presenters for the 98th Oscars.
— The Academy (@TheAcademy) March 5, 2026
Watch the #Oscars LIVE Sunday, March 15, at 7e/4p on ABC and Hulu, with Conan O’Brien hosting. #OnlyAtTheOscars pic.twitter.com/NEdABQDnMA
