
బీజింగ్: భారత్‌తో సరిహద్దు వివాదంపై చైనా కీలక వ్యాఖ్యలుచేసింది. భారత్‌తో సరిహద్దు వివాదం సంక్లిష్టమైనదేనని, కానీ సరిహద్దు విభజన సమస్యల పరిష్కారం కోసం చర్చలకు సిద్ధమని ప్రకటించింది. జూన్ 26న చైనాలోని కింగ్‌డావోలో షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్‌తో రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారత్, చైనా మధ్య సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి ఒక నిర్మాణాత్మక రోడ్ మ్యాప్ కింద కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రతిపాదించారు.
ALSO READ | NRI News: శుభవార్త.. అమెరికా నుంచి ఇండియాకు పంపే డబ్బుపై టాక్స్ 1 శాతానికి తగ్గింపు
వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి ఉద్రిక్తతలను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని, సరిహద్దును గుర్తించడానికి ఇప్పటికే ఉన్న యంత్రాంగాలను పునరుద్ధరించాలని రాజ్‌నాథ్ సింగ్ కోరారు. ఈ క్రమంలో రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలపై తాజాగా చైనా విదేశాంగ మంత్రి మావో నింగ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతదేశంతో దీర్ఘకాలంగా ఉన్న సరిహద్దు వివాదం సంక్లిష్టమైనదని, అది పరిష్కరించడానికి సమయం పడుతుందని పేర్కొన్నారు. సరిహద్దును డీలిమిట్ చేయడం, సరిహద్దు ప్రాంతాలలో శాంతిని నెలకొల్పడంపై చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
సరిహద్దు పరిష్కారం కోసం రెండు దేశాలు ఇప్పటికే ప్రత్యేక ప్రతినిధుల (SRs) యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాయని, రాజకీయ పారామితులు మార్గదర్శక సూత్రాలపై అంగీకరించాయని గుర్తు చేశారు. పరిమితుల విభజన చర్చలు, సరిహద్దు నిర్వహణ వంటి అంశాలపై భారతదేశంతో కమ్యూనికేషన్ కొనసాగుతోందని.. సరిహద్దు ప్రాంతాలను శాంతియుతంగా ప్రశాంతంగా ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సరిహద్దు మార్పిడి, సహకారాన్ని ప్రోత్సహించడానికి చైనా సిద్ధంగా ఉందని పునరుద్ఘటించారు.