ఇండియా, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ సెమీ ఫైనల్ ను.. 65.2 మిలియన్ల మంది వీక్షించారు..

ఇండియా, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ సెమీ ఫైనల్ ను.. 65.2 మిలియన్ల మంది వీక్షించారు..

అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌: ఇండియా, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ మధ్య గురువారం జరిగిన టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ సెమీఫైనల్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌.. డిజిటల్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ వ్యూయర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను జియో హాట్‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌లో 65.2 మిలియన్ల మంది చూశారని ఐసీసీ శుక్రవారం వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన లైవ్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో ఈ స్థాయి వ్యూయర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ఎప్పుడూ నమోదు కాలేదు. దాంతో ఇండియన్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో క్రికెట్‌‌‌‌‌‌‌‌కు ఉన్న ప్రజాదరణకు ఇది బలమైన రుజువుగా నిలిచింది.

‘రెండో సెమీస్‌‌‌‌‌‌‌‌ డిజిటల్‌‌‌‌‌‌‌‌ వీక్షకుల సంఖ్య వరల్డ్‌‌‌‌‌‌‌‌ రికార్డును నమోదు చేసింది. ఇండో, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను ఏకకాలంలో గరిష్టంగా 65.2 మిలియన్ల మంది చూశారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు ఇంత వ్యూయర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ నమోదు కాలేదు.  టాప్‌‌‌‌‌‌‌‌ గ్లోబల్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్లకు భారీ సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించే సత్తా ఉందని రుజువైంది. టోర్నీ నిర్వాహకులు, బ్రాడ్‌‌‌‌‌‌‌‌కాస్ట్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్స్‌‌‌‌‌‌‌‌కు కృతజ్ఞతలు. ఐసీసీలో మా టీమ్‌‌‌‌‌‌‌‌ కూడా విజయవంతంగా పని చేసింది’ అని ఐసీసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ జై షా వెల్లడించాడు.