Ziddi Ziddi Lyrical: ఎదురులేక సాగితే.. నిరాశ నీడ ఓడదా.. దూసుకెళ్తున్న ‘బైకర్’ మోటివేషనల్ సాంగ్

Ziddi Ziddi Lyrical: ఎదురులేక సాగితే.. నిరాశ నీడ ఓడదా.. దూసుకెళ్తున్న ‘బైకర్’ మోటివేషనల్ సాంగ్

శర్వానంద్ హీరోగా నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘బైకర్’ (Biker). అభిలాష్ రెడ్డి కంకర దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సంస్థ  నిర్మిస్తోంది. శుక్రవారం శర్వా బర్త్‌‌డే సందర్భంగా ఈ చిత్రం నుంచి యాంథమ్ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

జిబ్రాన్ కంపోజ్ చేసిన ఈ పాటకు కృష్ణకాంత్ రాసిన లిరిక్స్ మోటివేట్ చేసేలా ఉన్నాయి. జిబ్రాన్‌‌తోపాటు షెన్‌‌బగరాజ్, అరవింద్ శ్రీనివాస్, సుదర్శన్ రామ్ పాడిన తీరు ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సాంగ్ ఆడియన్స్ను అలరిస్తూ యూట్యూబ్లో దూసుకెళ్తోంది. 

‘నవ్వు మెరుపులా కదిలితే.. ఓసారి ఆగి చూడదా, పరుగుకూడా నిలవదా ప్రకాశ వేగమే.. ఏ ఎదురులేక సాగితే.. నిరాశ నీడ ఓడదా.. గెలుపు కూడా అలగదా..’ అంటూ ఇన్‌‌స్పైర్ చేసేలా సాగిన పాట సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇందులో శర్వానంద్ డేరింగ్ ప్రొఫెషనల్ మోటార్‌‌సైకిల్ రేసర్‌‌‌‌గా కనిపిస్తూ ఇంప్రెస్ చేశాడు.

‘బుల్లెట్‌‌ సునీల్‌‌’గా ఎక్స్ మోటోక్రాస్ లెజెండ్‌‌గా రాజశేఖర్ కనిపించారు. మాళవిక నాయర్ హీరోయిన్‌‌గా నటించగా,  బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ఇతర కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 3న సినిమా విడుదల కానుంది.