తెలంగాణకు మరో అమృత్ భారత్ స్లీపర్ రైలు... ఏపీ, తమిళనాడు, తెలంగాణను అనుసంధానం చేస్తూ సేవలు

తెలంగాణకు మరో అమృత్ భారత్ స్లీపర్ రైలు... ఏపీ, తమిళనాడు, తెలంగాణను అనుసంధానం చేస్తూ సేవలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్రానికి త్వరలో మరో అమృత్ భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రానుంది. జనరల్, సెకండ్ క్లాస్ కోచ్‌‌లు ఉన్న ఈ రైలు నాగర్‌‌కోయిల్–చర్లపల్లి మధ్య నడువనున్నది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ సేవలు అందించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. 

ప్రస్తుతం తెలంగాణలో మూడు అమృత్ భారత్ స్లీపర్ రైళ్లు నడుస్తున్నాయి. చర్లపల్లి-–ముజఫర్‌‌పూర్, చర్లపల్లి–-తిరువనంతపురం, జోగ్‌‌పని–ఈరోడ్ మార్గాల్లో ఈ రైళ్లు నడుస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.