
ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కు ఐపీఎల్ లో నిలకడైన జట్టుగా పేరుంది. ధోనీ కెప్టెన్సీలో ఎన్నో మరపురాని విజయాలను సొంతం చేసుకొని ఐపీఎల్ చరిత్రలో తిరుగులేని జట్టుగా నిలిచింది. ప్రస్తుతం గైక్వాడ్ చెన్నై కెప్టెన్ గా ముందుకు తీసుకెళ్తున్నాడు. ధోనీ రెండు సీజన్ లు కంటే ఎక్కువ ఆడలేడని స్పష్టంగా తెలుస్తుంది. దీని ఈ మెగా టోర్నీకి రిటైర్మెంట్ ప్రకటిస్తే చెన్నైధోనీ బ్యాటింగ్ తో పాటు అతని వికెట్ కీపింగ్ సైతం మిస్ అవ్వాల్సి వస్తుంది. ఈ దశలో ఐపీఎల్ ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరనున్నాడనే వార్తలు గత కొంతకాలంగా బాగా వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా ఉంటున్న సంజు శాంసన్ చెన్నై జట్టులోకి రావడం అసాధ్యమని.. ఇలాంటి వార్తల్లో వాస్తవం లేదని దాదాపు ప్రతి ఒక్కరూ భావించారు. రూమర్స్ ను నిజం చేస్తూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ శాంసన్ ను జట్టులోకి తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. CSK ఇలా అన్నాడు "మేము సంజు శాంసన్ ను ఖచ్చితంగా మా జట్టులో పరిగణిస్తాము. అతను ఒక ఇండియన్ బ్యాటర్.. వికెట్ కీపర్ కూడా. అదే విధంగా ఇన్నింగ్స్ ను కూడా ఓపెన్ చేయగలడు. అతను మాకు అందుబాటులో ఉంటే, ఖచ్చితంగా మా స్క్వాడ్ లో తీసుకోవడానికి ప్రయత్నిస్తాం.
ALSO READ | Yash Dayal: నాలుగున్నర సంవత్సరాల రిలేషన్.. RCB స్టార్ పేసర్‌పై లైంగిక వేధింపుల కేసు
మేము ఇంకా ట్రేడ్ ఆప్షన్స్ ను ఇంకా నిర్ధారించుకోలేదు. కానీ అతడిని మా జట్టులో తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాం. రాజస్థాన్ రాయల్స్‌తో మేము ఇంకా అధికారికంగా ఏమీ మాట్లాడలేదు". అని సూపర్ కింగ్స్ అధికారి ఒకరు అన్నారు. CSK సామ్సన్‌ను తీసుకోవాలనుకుంటే, వారు తమ ఆటగాళ్లలో కొంతమందిని బదులుగా రాజస్థాన్ జట్టుకు మార్పిడి చేసుకోవలసి ఉంటుంది. ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు సంజు శాంసన్ ను రాజస్థాన్ రాయల్స్ రూ.18 కోట్లకు రిటైన్ చేసుకుంది.