
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్ ఆడుతూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఫాస్ట్ బౌలర్ యష్ దయాల్ చిక్కుల్లో పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక మహిళ.. దయాల్ తనను మానసికంగా, శారీరకంగా వేధించాడని ఆరోపించింది. దయాల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు కూడా అధికారిక ఫిర్యాదు అందింది. ఘజియాబాద్‌కు చెందిన బాధితురాలు.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆన్‌లైన్ పోర్టల్‌లో యష్ దయాళ్ అనే క్రికెటర్‌పై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుల ప్రకారం.. యష్ దయాల్ ఇతర అమ్మాయిలతో కూడా తప్పుడు సంబంధాలలో పాల్గొన్నట్టు ఆరోపించింది.
ఆ మహిళ దయాళ్ తో నాలుగున్నర సంవత్సరాలకు పైగా సంబంధంలో ఉందని చెప్పుకొచ్చింది. ఈ సమయంలో ఈ ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్ వివాహ హామీలతో తనను తప్పుదారి పట్టించడమే కాకుండా.. తనను ఊటీకి తీసుకెళ్లి తన నివాసంలో 15 రోజులు ఉండనిచ్చాడని ఆమె ఆరోపించింది. ఆమె తరచుగా అతని ఇంటికి వెళ్లి అతని కుటుంబంతో సమయం గడిపినట్టు తనను పెళ్లి చేసుకుంటానని యష్ దయాల్ హామీ ఇచ్చాడని ఆమె తెలిపింది. యాష్ దయాల్, అతని కుటుంబం వివాహ హామీ ఇవ్వడం ద్వారా ఆమె ఆశలు పెంచుకుంటూనే ఉందని తెలిపింది.
అతని వ్యక్తిగత జీవితంలో తాను లోతుగా మునిగిపోయానని కూడా ఆమె అన్నారు. అయితే తాను పెట్టుకున్న ఈ నమ్మకాన్ని వమ్ము చేశాడని.. అదే సమయంలో దయాల్ చాలా మంది మహిళలతో సంబంధం కలిగి ఉన్నాడని ఆ మహిళ చెబుతుంది. ఏప్రిల్ 17, 2025న మరొక మహిళ ఆమెను సంప్రదించి, దయాల్ మోసం చేస్తున్నాడని.. అనేక మంది ఇతర మహిళలతో సంబంధాలు కలిగి ఉన్నాడని రుజువుగా చెప్పిందని తెలిసింది. ఆమె ఫిర్యాదు ప్రకారం దయాల్‌కు కనీసం ముగ్గురు ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయనే ఆమె అనుమానాలను వ్యక్తం చేసింది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2025 లో ఆర్సీబీ తరపున యష్ దయాల్ 13 వికెట్లు పడగొట్టి జట్టుకు టైటిల్ తీసుకొని రావడంలో కీలక పాత్ర పోషించాడు.
Cricketer Yash Dayal faces complaint from woman after 5-year relationship.
— Sann (@san_x_m) June 28, 2025
In this country, a man cannot even end a relationship. If things go wrong, it’s called rape.
All thanks to a judiciary that has reduced men, regardless of status, to second-class citizens. 😐 pic.twitter.com/xsIKB92u7i