రెగ్యులర్ సర్వీసులు ప్రారంభించాలని కేంద్ర రైల్వేశాఖ నిర్ణయం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం
న్యూఢిల్లీ: హైదరాబాద్ నుంచి మరో మూడు కొత్త రెగ్యులర్ రైళ్లను ప్రారంభించాలని కేంద్ర రైల్వేశాఖ నిర్ణయించింది. కొన్ని మార్గాల్లో ప్రయాణికుల నుంచి వచ్చిన డిమాండ్ కు అనుగుణంగా సేవలు అందిస్తున్న మూడు స్పెషల్ రైళ్లను.. రెగ్యులర్‌గా మార్చింది. వీటిలో కాచిగూడ – -ట్యూటికోరిన్, హైదరాబాద్-– కన్యాకుమారి, చర్లపల్లి-– షాలిమార్ మధ్య రెగ్యూలర్ గా ట్రైన్లు నడుపునున్నారు.
ఈ నిర్ణయంపై కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలిపారు. దీనివల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
కొత్త రెగ్యూలర్ ట్రైన్ల షెడ్యూల్..
17165/17616 నంబర్ తో కాచిగూడ–-ట్యుటికోరిన్ ఎక్స్ ప్రెస్ గా నడుపనున్నారు. ఈ రైలు ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడలో బయల్దేరి మంగళవారం రాత్రి 10:45 గంటలకు కేరళ రాష్ట్రంలోని ట్యూటికోరిన్ కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ట్యూటికోరిన్ నుంచి బుధవారం ఉదయం 7:45 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1:25 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
17069/17070 నంబర్‌తో హైదరాబాద్ –-కన్యాకుమారి- మధ్య ఎక్స్‌ప్రెస్ రైలు నడునుంది. ఈ రైలు ప్రతి బుధవారం సాయంత్రం 5:20 గంటలకు హైదరాబాద్ లో బయల్దేరి శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటలకు తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకుంటుంది. శుక్రవారం తెల్లవారుజామున 5:15 గంటలకు కన్యాకుమారిలో బయల్దేరి శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
17065/17066 నంబర్ తో చర్లపల్లి –-షాలిమార్- మధ్య అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ నడువనుంది. ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం 7:15 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరి మరుసటి రోజు బుధవారం ఉదయం 11:20 గంటలకు పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్‌కు చేరుకుంటుంది. తిరిగి బుధవారం మధ్యాహ్నం 12:50 గంటలకు షాలిమార్ లో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు చర్లపల్లికి వస్తుంది.
