
ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో భాగంగా బుధవారం (జూలై 2) నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచులో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఆడతాడా లేదా అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో రెండో టెస్ట్‌లో బుమ్రా ఆడటంపై భారత కెప్టెన్ శుభమన్ గిల్ క్లారిటీ ఇచ్చాడు. ప్రీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భాగంగా మంగళవారం (జూలై 1) గిల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా జరల్నిస్టులు బుమ్రా గురించి ప్రశ్నించారు.
ALSO READ | Sanju Samson: శాంసన్‌ను తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం: చెన్నై సూపర్ కింగ్స్ అధికారి
రెండో టెస్ట్ టీమ్ సెలక్షన్‌కు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉన్నాడని గిల్ క్లారిటీ. అయితే, బుమ్రా పనిభారాన్ని పరిగణనలోకి తీసుకుని మ్యాచ్ ముందురోజు ప్లేయింగ్ 11లో అతని ఎంపికపై జట్టు యాజమాన్యం తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నాడు. పని భారం కారణంగా సిరీస్‌కు ముందే బుమ్రా సిరీస్‌లోని ఏవైనా మూడు మ్యాచులు మాత్రమే ఆడుతాడని మాకు తెలుసన్నాడు. మిగిలిన రెండు మ్యాచులకు అతడి సేవలు కోల్పోతామని కానీ ప్రణాళికలు పక్కాగా ఉన్నాయని చెప్పాడు యువ కెప్టెన్.
కాగా, పని భారం కారణంగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదు మ్యాచుల సిరీస్‌లో ఏవైనా మూడు మ్యాచుల్లో మాత్రమే బుమ్రాను ఆడించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో బుమ్రా ఆడాడు. దీంతో సిరీస్‌లో అతడు మరో రెండు మ్యాచులు మాత్రమే ఆడే అవకాశం ఉంది.
దీంతో బుమ్రాను మిగిలిన నాలుగు మ్యాచుల్లో ఏ రెండు టెస్టుల్లో ఆడించాలనే దానిపై టీమిండియా మేనేజ్మెంట్ తీవ్ర కసరత్తు చేస్తోంది. 2025, జూలై 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. సిరీస్‌లో తొలి మ్యాచ్ ఓటమి చవిచూసిన నేపథ్యంలో రెండో టెస్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీమిండియా.. ఈ మ్యాచులో గెలుపే లక్ష్యంగా బుమ్రాను ఆడించేందుకే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.