GPay: గూగుల్ పేలో ఇలా చేయండి.. 20 రూపాయలు వచ్చి అకౌంట్లో పడతయ్ !

GPay: గూగుల్ పేలో ఇలా చేయండి.. 20 రూపాయలు వచ్చి అకౌంట్లో పడతయ్ !

Tuesday Treats పేరుతో గూగుల్ పే (Google Pay) 20 రూపాయలు మన అకౌంట్లో క్రెడిట్ చేసే ఆఫర్ తీసుకొచ్చింది. మొబైల్ పేమెంట్ అప్లికేషన్ గూగుల్ పే ప్రతీ మంగళవారం తమ యాప్ నుంచి పేమెంట్స్ చేసే తొలి 10 లక్షల మందికి 20 రూపాయలను ఖాతాలో జమ చేస్తోంది. అయితే.. 200 లేదా అంతకంటే ఎక్కువ అమౌంట్ను గూగుల్ పే ద్వారా సెండ్ చేసినప్పుడు మాత్రమే ఈ 20 రూపాయల ఆఫర్ వర్తిస్తుంది. ఇండియాలో గూగుల్ పే నుంచి రోజుకు లక్షల సంఖ్యలో ట్రాన్షాక్షన్స్ జరుగుతుంటాయి.

అందులో.. తొలి 10 లక్షల మందికి మాత్రమే ఈ 20 రూపాయలు క్రెడిట్ అవుతాయి. ఈ మంగళవారం ఆ అవకాశం ఎలాగూ లేదూ. వచ్చే మంగళవారం అయినా ఈ 20 రూపాయలను దక్కించుకునేందుకు ప్రయత్నించండి. ఈ ఆఫర్ తమిళనాడులో అందబాటులో ఉండదు. సో.. చెన్నైలో ఉండే తెలుగు వాళ్లు ట్రై చేసినా ఆ 20 రూపాయలను సొంతం చేసుకోలేరు. తమిళనాడు ప్రైజ్ స్కీం యాక్ట్ 1979 ప్రకారం ఇలా ప్రైజ్ మనీ ఇవ్వడం ఆ రాష్ట్రంలో చట్ట విరుద్ధం. అందుకే.. తమిళనాడు వరకూ ఈ ఆఫర్ వర్తించదు.

ALSO READ | వొడఫోన్ ఐడియా క్రేజీ ఆఫర్.. ఏడాది రీఛార్జ్‌పై 24 రోజులు అదనపు వ్యాలిడిటీ, వారికి మాత్రమే..

మొబైల్ పేమెంట్ సర్వీస్‌‌‌‌లను అందిస్తున్న యాప్‌‌‌‌ల వాడకం విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఫోన్‌‌‌‌పే, పేటీఎం, గూగుల్‌‌‌‌ పే వంటి యాప్‌‌‌‌ల ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే రివార్డులు, క్యాష్ బ్యాక్‌‌‌‌లు వస్తుంటాయి. రివార్డులు కూడా వేరే కంపెనీ ప్రొడక్ట్‌‌‌‌పై డిస్కౌంట్‌‌‌‌గా ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్‌‌‌‌ కోసం కూడా కంపెనీలు ఖర్చు చేస్తాయి. కొన్ని సార్లు పేమెంట్ యాప్‌‌‌‌లతో కలిసి కంపెనీలు ఈ డిస్కౌంట్లను ఇస్తాయి.

కస్టమర్లు యూపీఐ ద్వారా కాకుండా చేసే ట్రాన్సాక్షన్‌‌‌‌పై పేమెంట్ యాప్‌‌‌‌లకు కమీషన్ అందుతుంది. భారత్లో యూపీఐ చెల్లింపులు అనూహ్యంగా పెరగడంతో ఫ్లిప్ కార్ట్ కూడా సూపర్ మనీ పేరుతో మొబైల్ పేమెంట్ సర్వీస్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రతీ ట్రాన్షాక్షన్పై మినిమం క్యాష్ బ్యాక్ ఇస్తుండటంతో తక్కువ టైంలోనే ఈ యాప్ కూడా బాగా పాపులర్ అయింది.