మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ రైడ్స్..

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ రైడ్స్..

రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. రిజిస్ట్రార్ ఆఫీసులు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవకతవకలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు శుక్రవారం ( నవంబర్ 14 ) తనిఖీలు చేపట్టారు అధికారులు. ఈ క్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో హైదరాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తో పాటు అధికారులు సుమారు రెండు గంటల పాటు తనిఖీలు నిర్వహించారు.

మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులో అవకతవకలపై పలు ఫిర్యాదులు రావడంతో 15 మంది ఏసీబీ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. డాక్యుమెంట్ రైటర్లు నేరుగా వచ్చ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. దీంతో వారి దగ్గర ఉన్న దస్తావేజులు తీసుకుని అసలు రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి దస్త్రాలను అందచేశారు అధికారులు. 

ఈ తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న నగదు గురించి.. ఇతర ఆధారాల గురించి వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని తెలిపారు ఏసీబీ అధికారులు.ఇదిలా ఉండగా.. నార్సింగి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కూడా సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు.