జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఫేక్ ప్రచారాన్ని ప్రజలు తిప్పి కొట్టారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచిన సందర్భంగా మాట్లాడిన మంత్రి.. ప్రజలు అభివృద్ధికి మద్ధతు ఇచ్చారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి వచ్చినా ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారని అన్నారు.
2025 నవంబర్ 14న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు. రేవంత్ సీఎం, కొత్త ప్రభుత్వం, గ్యారెంటీ కార్డ్స్, సన్న రేషన్ బియ్యం, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి తమను గెలిపించాయని అన్నారు.
కేటీఆర్ ఫెయిల్ అయ్యారు:
కేటీఆర్ వర్కింగ్ ప్రసిడెంట్ గా ఫెయిల్ అయ్యారని విమర్శించారు మంత్రి వివేక్. కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉద్యోగాలు తెచ్చినం అంటారు.. కానీ మున్సిపల్ మంత్రిగా ఫెయిల్ అయ్యారు.. రోడ్లు, డ్రైనేజీలు పదేళ్లలో ఏం చేయలేకపోయారు.. జూబ్లీహిల్స్ లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని అన్నారు.
కేటీఆర్ వర్కింగ్ ప్రసిడెంట్ అయ్యాక అన్నీ ఓడిపోతున్నారు.. 2019 లో కారు సారు పదహారు అని.. 7 సీట్లు ఓడిపోయారు.. సొంత చెల్లిని కూడా గెలిపించుకోలేకపోయారు..
నేను సీఎం అనే భ్రమలో ఉండిపోయారు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు.. పార్లమెంట్ లో డిపాజిట్లు పోయినయి.. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో క్యాండేట్స్ నే నిలబెట్టలేకపోయారు.. అని అన్నారు మంత్రి వివేక్.
జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత కేటీఆర్ ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. నా లీడర్ షిప్ టీఆర్ఎస్ కు లాభమా నష్టమా అనిలేదా అని కేటీఆర్ ఆలోచించుకోవాలి.. బీఆర్ఎస్ వాళ్లు కూడా ఆలోచించుకోవాలి.. కేటీఆర్ నాయకత్వం పార్టీకి ఎంత మేరకు లాభం చేకూరుస్తుందని ఆలోచించుకోవాలి.. అన్నారు.
వీక్ లీడర్ షిప్ కారణంగా బీఆర్ఎస్ ఓడిపోతోంది.. కేటీఆర్, హరీష్ మధ్య గొడవలు వచ్చేలా ఉన్నాయి.. వీళ్లిద్దరిలో ఎవరు బెటర్ లీడర్..? అని కార్యకర్తలు ఆలోచించుకోవాలి.. పార్టీ బతకాలంటే ఏం చేయాలి..? ఫెయిల్యూర్ అవుతున్నడు అని ఆలోచించుకోవాలి.. కేటీఆర్ కింద పనిచేయాలా వద్దా అని హరీశ్ ఆలోచించాలి..? అని సూచించారు. కేటీఆర్ దగ్గర కంటెంట్ లేనప్పుడు సోషల్ మీడియాలో ఎంత ఫేక్ ప్రచారం చేసినా పనిచేయదని అన్నారు మంత్రి వివేక్.
